కరోనా కష్టకాలంలో బాలీవుడ్ నటుడు సోనుసూద్ రియల్ హీరోగా అవతరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాల్ని సరైన వైద్యం అందించాలని ఎప్పటికప్పుడు అభ్యర్ధిస్తూ.. కరోనా రోగుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. తన దృష్టికొస్తే తానే స్వయంగా కొవిడ్ సెకెండ్ వేవ్ కి సంబంధించిన మందులను ఉచితంగా అందిస్తూ గొప్ప సేవా ధృక్ఫదాన్ని చాటుకుంటున్నారు. ఎంతో మంది పేద ప్రజల పాలిట రియల్ హీరోగా నిలుస్తున్నారు.
బెడ్స్- ఆక్సిజన్ అవసరం లేని చాలామంది కొవిడ్ రోగులకు ఉచితంగా మందులు సరఫరా చేస్తున్నారు. ఇటీవలే టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ ట్విటర్లో వెంకట రమణ అనే వ్యక్తి కొన్ని ఇంజెక్షన్స్ అందించాలని.. దానికి తగ్గ డబ్బు చెల్లిస్తానని రిక్వెస్ట్ పెట్టగా ఆయన అడిగిన 24 గంటల్లోనే Tocilizumb 400 mg ఇంజక్షన్ ను.. ఇతర మందులను ఉచితంగా పంపించారు.
తాజాగా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఒక రెమిడెసివిర్ ఇంజెక్షన్ అర్జెంట్ గా కావాలని ట్విటర్లో ఎవరికి ట్యాగ్ చేయకుండా కేవలం షేర్ మాత్రమే చేసారు. కర్ణాటకలోని బసవప్ప ఆసుపత్రిలో ఓ రోగికి ఇది అత్యవసరమని కోరడంతో...ఆ పేషెంట్ తాలుకా ఫోన్ నంబర్ కూడా పెట్టాడు. దీంతో సోను సూద్ కంట పడటంతో వెంటనే స్పందించారు. భాజీ త్వరలోనే అది బాధితుడికి చేరుతుందని భరోసా కల్పించారు. ఎవర్నీ ట్యాగ్ చేయకపోయినా సోను భయ్యా స్పందించారంటూ భజ్జీ ధన్యవాదాలు తెలిపారు. మహమ్మారి భారత్ లో ప్రవేశించిన నాటి నుంచి సోనుసూద్ ఎలాంటి సేవాకార్యక్రమాలు చేస్తున్నారో? తెలిసిందే.
తొలి దశలో వలస కార్మికుల్ని తమ స్వస్థలాలకు తరలించే ప్రక్రయలో భాగంగా స్వయంగా సొంత డబ్బు ఖర్చు చేసి బస్సులు వేసి స్వరాష్ట్రాలకు తరలించారు. అదే సమయంలో ఉచితంగా భోజనం సహా పలు సౌకర్యాల్ని సోనుసూద్ కల్పించారు. ప్రభుత్వాలే చేయని ఎన్నో కార్యక్రమాలు చేసారు. ఇక సెకెండ్ వేవ్ లో మెడికల్ మాఫియా దోచేస్తున్నా..సోను సూద్ మాత్రం ఉచితంగా ఖరీదైన ఇంజెక్షన్లు.., మందులు అందిస్తున్నారు.