తమిళ సూపర్ స్టార్ కూతురు సౌందర్య మరియు ఆమె భర్త విశాకన్ మూడు రోజుల క్రితం చెన్నై నుండి లండన్ వెళ్లారు. అక్కడ విమానాశ్రయంలో పాస్ పోర్ట్ మరియు అమెరికన్ డాలర్లు ఉన్న బ్రీఫ్ కేస్ పోగొట్టుకున్నారు. విమానాశ్రయ సిబ్బంది పాస్ పోర్ట్ అడిగిన సమయంలో వారివద్ద ఆ బ్రీఫ్ కేసు కనిపించలేదు. దాంతో వెంటనే ఎయిర్ పోర్ట్ పోలీసులకు ఆ స్టార్ కపుల్ ఫిర్యాదు చేయడం జరిగింది. పాస్ పోర్ట్ లేకుండా అనుమతించమంటూ విమానాశ్రయ సిబ్బంది చెప్పి అక్కడే ఉండే గెస్ట్ హౌస్ కు పంపించారు.
విషయం తెలుసుకున్న రజినీకాంత్ ఇక్కడ కేంద్రం పెద్దలతో మాట్లాడి లండన్ లో ఉన్న భారత దౌత్య అధికారులతో మాట్లాడించాడు. వెంటనే భారత దౌత్య అధికారులు తాత్కాలిక పాస్ పోర్ట్ ను తయారు చేసి వారికి అందజేయడంతో సౌందర్య మరియు విశాకన్ లు బయడ పడ్డారు. మరో వైపు వారి బ్రీఫ్ కేసు ఎక్కడ పోయిందనే విషయమై ఎంక్వౌరీ చేస్తున్నారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రజినీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం పెద్దలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న కారణంగా గంటల వ్యవధిలో అంతా సెట్ అయ్యింది.