సౌత్ టాప్-10 సంగీత ద‌ర్శ‌కుల పారితోషికాలు

Update: 2021-05-16 10:30 GMT
టాప్ హీరోలు.. అందాల క‌థానాయిక‌లు.. ద‌ర్శ‌కుల పారితోషికాల గురించి తెలిసినంత‌గా సంగీత ద‌ర్శ‌కుల పారితోషికాల గురించి తెలిసేది త‌క్కువ‌. సౌత్ లో ట్యాలెంటెడ్ సంగీత ద‌ర్శ‌కులు చాలామంది ఉన్నారు. అందులో టాప్ -10 సంగీత ద‌ర్శ‌కుల పారితోషికాల్ని ప‌రిశీలిస్తే ఆస‌క్తిక‌ర వివ‌రాలు తెలిసాయి.

స్వ‌ర‌మాంత్రికుడు AR రెహమాన్ ఆల్వేస్ టాప్ లో ఉంటారు. ఆయ‌న జాతీయ అంత‌ర్జాతీయ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నా బాలీవుడ్ స‌హా తెలుగు-త‌మిళ చిత్రాల‌కు భారీ పారితోషికం చెల్లించేందుకు మ‌న నిర్మాత‌లు సిద్ధంగా ఉంటారు. దాదాపు 5 కోట్లు (సినిమా బడ్జెట్ ఆధారంగా) ఆయ‌న పారితోషికం. శంక‌ర్ సినిమాల‌కు ఇంకా పెద్ద మొత్తం వ‌సూలు చేస్తారు.

దేవి శ్రీ ప్రసాద్ యావ‌రేజ్ గా 1.5 నుండి 2 కోట్లు తీసుకునేవారు. కానీ ఇటీవ‌ల‌ అత‌డి రేంజు 4 కోట్ల‌కు పెరిగింది. అల వైకుంఠ‌పుర‌ములో స‌క్సెస్ త‌ర్వాత ఏకంగా డ‌జ‌ను సినిమాల‌కు సంత‌కాలు చేసిన థ‌మ‌న్ ఒక్కో చిత్రానికి 2 కోట్లు తీసుకునేవారు. కానీ ఇటీవ‌ల థ‌మ‌న్ 3 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు.

ఎంఎం కీరవాణి - 75 లక్షల నుండి 1.5 కోట్ల వరకు (సినిమా బడ్జెట్ ఆధారంగా) అందుకుంటారు. హారిస్ జయరాజ్ - 1-2 కోట్లు.. యువన్ శంకర్ రాజా - 2 నుండి 3 కోట్లు.. మణి శర్మ - 75 లక్షల నుండి 1.5 కోట్లు.. అనిరుధ్ రవి చందర్ - 2 కోట్లు.. గోపి సుందర్ - 50 లక్షల నుండి 80 లక్షలు... మిక్కీ జె మేయర్ - 50 - 75 లక్షలు.. హిప్ హాప్ తమీజా - 70 లక్షలు..అనూప్ రూబెన్స్ 40-50 లక్షలు..గిబ్రాన్ - 50 లక్షలు .. జివి ప్రకాష్ - 50 లక్షల నుండి 1 కోటి వరకు.. వివేక్ సాగర్ 40 - 50 లక్షలు అందుకుంటున్నారు. సినిమాల బ‌డ్జెట్ల‌ను బ‌ట్టి కూడా వీళ్ల పారితోషికం మారుతుంటుంది. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో థ‌మ‌న్- దేవీశ్రీ‌ల హ‌వా సాగుతోంది. ఈ ఇద్ద‌రూ ఏడాదికి అర‌డ‌జ‌ను పైగానే సినిమాలు చేస్తున్నారు. అంటే వార్షికాదాయం 10-15కోట్లు పైమాటే ఆ ఇద్ద‌రికీ.
Tags:    

Similar News