తన గాత్రంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. దేశంలోనే అత్యంత గొప్ప గాయకుల్లో ఒకరిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన ఈ స్వరశిఖరం.. నేలకొరిగి సరిగ్గా మూడు నెలలు గడిచాయి. అయినప్పటికీ.. ఆయన అభిమానులు తమదైన రీతిలో ఇంకా నివాళులర్పిస్తూనే ఉన్నారు.
తాజాగా.. బాలు గౌరవార్థం పుదుచ్చేరిలోని ఓ బేకరీ.. బాలు విగ్రహాన్ని చాక్లెట్ తో తయారు చేసింది. ‘జుకా చాక్లెట్’ కేఫ్ చెఫ్ రాజేంద్రన్ ఈ విగ్రహాన్ని రూపొందించింది. మొత్తం చాక్లెట్‌తో నిర్మించిన ఈ విగ్రహం బరువు 339 కిలోలు. ఎత్తు 5.8 అడుగులు. ఈ విగ్రహాన్ని రూపొందించడానికి తమకు 161 గంటల సమయం పట్టిందని కేఫ్ బృందం తెలిపింది.
ప్రజల సందర్శనార్థం ఈ విగ్రహాన్ని జనవరి 3 వరకు అందుబాటులో ఉంచుతామని కేఫ్ నిర్వాహకులు తెలిపారు. ఈ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆగస్టు 5న కరోనావైరస్ బారినపడిన బాలు.. ఆగస్టు 13న మరింత అనారోగ్యానికి గురయ్యారు. వైరస్ ప్రభావంతో ఆయన ఊపిరితిత్తుల చెడిపోవడంతో సెప్టెంబర్ 25న మరణించారు.
గతంలో ఈ కేఫ్ నిర్వాహకులు మహత్మగాంధీ, సూపర్ స్టార్ రజినీకాంత్, ఎంఎస్ ధోని, చార్లీ చాప్లిన్, ఏపీజే అబ్దుల్ కలాం, ఆర్మీ కమాండర్ అభినందన్ చాక్లెట్ విగ్రహాలు కూడా తయారుచేశారు.