గాన గంధర్వుడు బాల సుబ్రమణ్యం(74)కు కన్నీటి వీడ్కోలు పలికారు. అత్యంత సన్నిహిత కుటుంబసభ్యుల మధ్య చెన్నై- తామరైపాకం ఫాం హౌజ్ లో తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. బాలు కుమారుడు చరణ్ వైదిక కార్యక్రమాల్ని జరిపగా కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. బాలు ఆప్తుడు డైరెక్టర్ భారతీరాజా నివాళి అర్పించారు. ఉదయం 10.30గంటలకు అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభం కాగా.. అభిమానులెవరూ రాకుండా కలెక్టర్ ఉత్తర్వులు ఉండడంతో కొంత నిరాశ ఎదురైంది. అయితే ఏ ఉత్తర్వుల్ని లెక్క చేయక అభిమానులు పోటెత్తడం అక్కడ కనిపించింది.
బాలు కడ చూపు కోసం అభిమానులు తండోపతండాలుగా విచ్చేశారు. శుక్రవారం మధ్యా హ్నం 1:04 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించిన అనంతరం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు శోక సంద్రంలోకి వెళ్లిపోయిన సంగతి విధితమే. ఆయన లేని లోటు చిత్రపరిశ్రమలో అలానే ఉండిపోతుంది. దాదాపు 40 వేల పాటలతో ఆయన ఒక చరిత్రను రాసి వెళ్లారు.
తమిళనాడు సీఎం పళని స్వామి.. ఏపీ తరపున బాలు సొంత జిల్లాకి చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇక బాలును ఎంతో గొప్పగా అభిమానించే అలీ కన్నీటి పర్యంతమవుతూ నివాళులు అర్పించారు. అలీ - ఎస్పీబీ హైదరాబాద్ లో ఇరుగు పొరుగు ఇండ్లలోనే నివశించేవారన్న సంగతి తెలిసిందే.