గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అయిదు దశాబ్దాల సినీ కెరీర్ లో 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. ఆయన పాడిన పాటల్లో ఎన్నో సూపర్ హిట్ ఉన్నాయి. ఆయన స్టేజ్ షోలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. అలాంటి బాలు గారి మరణంను ఆయన అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. పాట బతికి ఉన్నంత కాలం ఆయన గుర్తు ఉంటారు అనడంలో సందేహం లేదు. ఘంటసాల గారి పాట విన్న ప్రతి సారి ఆయన ఎలా గుర్తుకు వస్తారో ఇకపై బాలు గారి 40 వేల పాటల్లో ఏ పాట విన్నా ఆయన గుర్తుకు వస్తారు. బాలు గారు చివరగా పాడిన పాట ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో సంగీత దర్శకుడు డి ఇమ్మాన్ ఆ విషయమై క్లారిటీ ఇచ్చారు.
సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'అన్నాత్తే' సినిమాలోని హీరో ఎంట్రీ సాంగ్ ను బాలు పాడారట. లాక్ డౌన్ కు ముందే ఆ పాటను రికార్డ్ చేసినట్లుగా ఇమ్మాన్ పేర్కొన్నారు. రజినీకాంత్ ప్రతి సినిమాలో కూడా బాలు గారి పాట ఉంటుంది. అలాగే అన్నాత్తే సినిమాలో కూడా బాలు గారి పాటను పెట్టడం జరిగింది. దాంతో సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ అన్నాత్తే కోసం పాడిన పాటే బాలు గారి చివరి పాట. సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాత్తే మూవీ కోసం బాలు గారు పాడిన పాట కోసం ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో అన్నాత్తే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. బాలు గారి చివరి పాట వినాలంటే అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.