డ్రస్‌ లపై మళ్లీ స్పందించిన మెగా బ్రదర్‌

Update: 2019-02-19 07:15 GMT
హీరోయిన్స్‌ మరియు అమ్మాయిలు అవసరం ఉన్నా లేకున్నా పొట్టి డ్రస్‌ లు వేసుకుంటున్నారని, పబ్లిక్‌ కార్యక్రమాల్లో అసభ్యంగా కనిపిస్తున్నారు అంటూ కొందరు ఇటీవల అమ్మాయిలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో నాగబాబు వంటి వారు అమ్మాయిలకు మద్దతుగా నిలుస్తున్నారు. అమ్మాయిలు ఎలాంటి డ్రస్‌ లు వేసుకుంటే మీకు ఏంటీ, వారి వ్యక్తిగత అభిప్రాయాలను తప్పుపట్టేందుకు మీరు ఎవరు అంటూ హీరోయిన్స్‌ ను సమర్ధించిన విషయం తెల్సిందే. ఆ విషయం అక్కడితో అయిపోయిందనుకుంటే మరోసారి నాగబాబు ఆ విషయమై స్పందించాడు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగబాబును ఎస్పీ బాలు గారు చేసిన వ్యాఖ్యల్లో మీకు అంతగా తప్పు ఏమనిపించిందని, ఆడవారు పద్దతైన డ్రస్‌ లలో పబ్లిక్‌ కార్యక్రమాల్లో పాల్గొనాలి అనేది ఆయన ఉద్దేశ్యం కదా అంటూ ప్రశ్నించగా నాగబాబు స్పందిస్తూ... ఎస్పీ బాలు గారు మాత్రమే కాకుండా గతంలో మురళి మోహన్‌, గరికపాటి, జేసుదాసు ఇంక కొందరు కూడా కామెంట్స్‌ చేశారు. ఒక స్త్రీని గౌరవ దృష్టితో చూడక పోగా, సమానత్వంగా చూడక పోగా ఇలాంటి కామెంట్స్‌ చేయడం ఏంటీ, అమ్మాయిలను అలాంటి డ్రస్‌ లు వేసుకోవద్దు అనడం ఏంటీ, హీరోయిన్స్‌ స్టైలిష్‌ గా తయారు అయితే నిర్మాతలను, దర్శకులను బుట్టలో పడేసుకోవడానకని, హీరోల దృష్టిని ఆకర్షించడానికి అంటూ చీప్‌ కామెంట్స్‌ చేయడమేనా అన్నాడు.

ఆడవారు వేసుకునే డ్రస్‌ లను అసభ్యకర డ్రస్‌ లు అని అనడం ఏంటీ, వారు ఎలాంటి డ్రస్‌ లు వేసుకోవాలో వారి ఇష్టం. వారి ఇష్టానుసారంగా డ్రస్సింగ్‌ అయ్యే హక్కు వారికి ఉంది. ఆ హక్కును కాదనే అధికారం ఎవరికి లేదు. ఆడపిల్లలు వేసుకునే డ్రస్‌ లపై కామెంట్‌ చేసే రైట్‌ ఎవరికి లేదు. అలా ఒకరి డ్రస్‌ ల గురించి కామెంట్‌ చేసే వారు ముందుగా వారి గురించి ఆలోచించుకోవాలని నాగబాబు సలహా ఇచ్చారు. భారత దేశంలో ఏ మగాడు కూడా ఆడదాన్ని గౌరవించడం లేదు, ప్రతి ఒక్కడు తొక్కేసేందుకు ప్రయత్నిస్తున్నాడు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

నేను ఒక మహిళకు కొడుకుగా, భర్తగా, తండ్రిగా ఈ విషయాల గురించి మాట్లాడుతున్నాను. ఆడవారి పట్ల గౌరవం కనబర్చి, వారు చేసే పనులను, వారి డ్రస్‌ లను గౌరవించాలంటూ నాగబాబు మరోసారి ఇంటర్వ్యూలో సూచించాడు. నాగబాబు పదే పదే అమ్మాయిల డ్రస్‌ లకు మద్దతుగా మాట్లాడటంతో హీరోయిన్స్‌, యాంకర్స్‌ ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నారు. 
Tags:    

Similar News