డిజిటల్ వరల్డ్ లోకి 'స్పార్క్' పేరుతో సరికొత్త ఓటీటీ..!

Update: 2021-05-08 18:35 GMT
కరోనా మహమ్మారి కారణంగా ఎంటర్టైన్మెంట్ కి దూరమైన ప్రేక్షకులు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ని ఆశ్రయిస్తున్నారు. వైరస్ భయంతో ఇంట్లోనే చిన్న స్క్రీన్‌ పై సినిమా చూసేందుకు జనాలు ఆసక్తి చూపడంతో అనేక కొత్త ఓటీటీలు పుట్టుకొస్తున్నాయి. ఇక థీయేటర్లు మూత పడటంతో చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అన్నీ ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హవా కొనసాగిస్తున్న ఓటీటీలకు ధీటుగా డిజిటల్ వరల్డ్ లోకి 'స్పార్క్' అనే సరికొత్త ఓటీటీ వస్తోంది.

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సపోర్ట్ తో యువ వ్యాపారవేత్త సాగర్‌ మచనూరు 'స్పార్క్' (SPARK) ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ కి శ్రీకారం చుట్టారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘D-కంపెనీ’ సినిమాతో మే 15న 'స్పార్క్' ఓటీటీని గ్రాండ్ గా ప్రారంభిస్తున్నారు. న్యూ ఏజ్ ఆడియన్స్ కు పూర్తిగా కొత్త తరహా ఎంటర్టైన్మెంట్ అందించాలానే లక్ష్యంతో ఈ ఫ్లాట్ ఫార్మ్ రెడీ అవుతోందని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే ఉన్న ఓటీటీలకు ధీటుగా విభిన్నమైన కంటెంట్ ని వీక్షకులకు అందించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

‘D-కంపెనీ’ తో పాటుగా 'ఆర్జీవీ మిస్సింగ్' - 'డేంజరస్' - 'దిశ ఎంకౌంటర్' - 'జగన్ మొండి' వంటి సినిమాలను స్ట్రీమింగ్ కి పెట్టనున్నారు. అలానే సునీల్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'కనబడుటలేదు' - 'టాబ్లెట్' - 'క్యాబ్ స్టోరీస్' - 'ఇది మహాభారతం కాదు' - 'మనిషి' - 'భీమునిపట్నం' - 'తెరవెనుక భాగోతం' - 'న్యూటన్' - 'సెక్రటరీ' - 'ఫ్లాట్ నెం.143' వంటి సినిమాలు రాబోయే రోజుల్లో విడుదల కానున్నాయి. 'స్పార్క్' ఓటీటీ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎస్‌.ఎస్‌ రాజమౌళి - ప్రభాస్‌ - ప్రకాశ్‌ రాజ్‌ - దగ్గుబాటి సురేశ్‌ బాబు - బ్రహ్మానందం - సుబ్బరాజు - పూరి జగన్నాథ్‌ - మంచు లక్ష్మీ - అడవి శేష్ - రితేష్ దేశముఖ్ - విజయేంద్ర ప్రసాద్ వంటి పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

ఇకపోతే 'స్పార్క్' అనేది ఒక యూకే ఆధారిత ఇంక్రివెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క యూనిట్. ఇప్పుడు ప్రేక్షకులకు ఫ్రెష్ కంటెంట్ ని అందించడానికి ఇండియన్ ఓటీటీ మార్కెట్ లో అడుగుపెడుతోంది. 'స్పార్క్' హెడ్ ఆఫీస్ గోవాలో.. హైదరాబాద్ మరియు మిగతా కీ మెట్రో సిటీస్ లో బ్రాంచెస్ ఓపెన్ చేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. డిజిటల్ వరల్డ్ లోకి కొత్తగా వస్తున్న 'స్పార్క్' మిగతా ఓటీటీలకు పోటీగా నిలుస్తూ ఏ మేరకు ఆదరణ తెచ్చుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News