నా‌ హృద‌యంలో రవితేజకు స్పెష‌ల్ బెర్త్‌.. స్టార్ హీరోయిన్‌!

Update: 2021-02-18 10:40 GMT
క‌మ‌ల్ హాస‌న్ కూతురిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాస‌న్‌. ఎంట్రీ పాస్ ఈజీగానే ల‌భించిన‌ప్ప‌టికీ.. స‌క్సెస్ మాత్రం అంత తేలిగ్గా రాలేదు. ఫ‌స్ట్ స‌క్సెస్ కోసం చాలా కాలం వెయిట్ చేసింది శృతి. తెలుగులో ప‌వ‌ర్ స్టార్ ‘గ‌బ్బ‌ర్ సింగ్'తో లక్కీ గాళ్ గా మారిపోయిన శృతి.. ఆ త‌ర్వాత వ‌రుస హిట్ల‌తో దూసుకెళ్లింది. అయితే.. చాలా గ్యాప్ త‌ర్వాత ‘క్రాక్' సినిమాతో టాలీవుడ్ కు తిరిగొచ్చింది శృతి.

దాదాపు మూడేళ్ల త‌ర్వాత తెలుగు ప్రేక్షకులను అల‌రించింది శృతి. ఈ సినిమా స‌క్సెస్‌ కావడంతో వరుస ఛాన్స్ అందుకుంటోంది శృతి. ఇటు వెండితెరపై న‌టిస్తూనే.. అటు డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైనా సత్తా చాటుతోందీ అమ్మ‌డు. ఈమె నటించిన `పిట్ట కథలు` వెబ్ సిరీస్ ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శృతి.. తెలుగు హీరోల గురించి త‌న మ‌న‌సులోని మాట‌లు చెప్పింది.

మాస్ మహారాజ్ రవితేజ గురించి మాట్లాడుతూ.. రవితేజతో కలిసి 'బలుపు', 'క్రాక్' సినిమాలు చేశానని చెప్పిన శృతి.. ఆయన వ్య‌క్త‌త్వాన్ని వివ‌రించింది. ఆయ‌న‌లో అహంభావం ఏమాత్రం ఉండదని,  అందరితోనూ సరదాగా కలిసిపోతుంటారని చెప్పింది. అంతేకాదు.. ర‌వితేజ త‌న‌కు  చాలా స్పెషల్ అని చెప్పిన శృతి.. త‌న‌ హృదయంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పింది.

అదేవిధంగా.. అల్లు అర్జున్ గురించి కూడా చెప్పింది. బ‌న్నీ ఎక్కువగా కష్టపడుతుంటాడని, వృత్తి పట్ల అంకిత భావంతో ఉంటాడని చెప్పింది శృతి. ఇక‌, సూపర్‌స్టార్ మహేష్ బాబు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారని, ఆయనతో కలిసి పనిచేసినందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నానని కూడా చెప్పింది శృతి.
Tags:    

Similar News