కథ బాగుంటే తన పాత్రకు తక్కువ ప్రాధాన్యం ఉన్నా ఒప్పుకునే నాగ శౌర్య ఇటీవలే విడుదలైన ఓ బేబీలో సమంతానే వన్ విమెన్ షో చేసినప్పటికీ తనను ఇష్టపడే అబ్బాయిగా ప్రేక్షకుల దృష్టిలో మరోసారి పడ్డాడు. ఛలో లాంటి బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేస్తున్న నాగ శౌర్య సబ్జెక్టుల విషయంలో తొందరపాటు ప్రదర్శించకుండా స్లో అండ్ స్టడీగా వెళ్తున్నాడు. ఇటీవలే చిన్న ప్రమాదం బారిన పడిన శౌర్య దాన్నుంచి త్వరగానే కోలుకుంటున్నాడు.
ప్రస్తుతం అశ్వద్ధామ చేస్తున్న శౌర్య త్వరలో రాఘవేంద్ర రావు నిర్మాణంలో ముగ్గురు దర్శకులు రూపొందించబోయే మూడు ప్రేమకథలు ఉన్న సినిమా ఒకటి చేయబోతున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి దర్శకేంద్రుడు ఆ మధ్య చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తప్ప పూర్తి వివరాలు వెల్లడించలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ ముగ్గురు దర్శకుల్లో ఒకరు క్రిష్ ఫిక్స్ అయ్యారు. లవ్ స్టోరీ కాబట్టి సున్నితమైన ఎమోషన్స్ ని చూపిస్తూనే ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇచ్చేలా ఇది ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది.
టీమ్ తో పాటు మిగిలిన వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. అయితే ఈ మూడు ప్రేమకథలు ఒకే సినిమాలో ముగ్గురు దర్శకులు విడివిడిగా తీసిన ట్రాక్స్ ని కలుపుతారా లేక మూడు సినిమాలు తీస్తారా అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇంకొద్ది రోజుల్లో నాగ శౌర్య రెడీగా ఉన్నాను అని చెప్పగానే రాఘవేంద్ర రావు గారి నుంచి పూర్తి అనౌన్స్ మెంట్ రావొచ్చు.