షాక్‌: 'జాను' థియేట‌ర్లో ప్రేక్ష‌కుడు మృతి

Update: 2020-02-08 07:31 GMT
శ‌ర్వానంద్-స‌మంత జంట‌గా న‌టింటిన‌ జాను ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. త‌మిళ్ లో విజ‌యం సాధించిన 96కి రీమేక్ ఇది. ఇదో ఫీల్ గుడ్ ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరి అన్న టాక్ వ‌చ్చింది. ఎమోష‌న్ సంగ‌తేమో కానీ... జాను థియేట‌ర్లో ఊహించ‌ని ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం చిత్ర‌బృందాన్ని క‌ల‌వ‌ర‌పెట్టింది. హైద‌రాబాద్ ఎర్ర‌గ‌డ్డ ప్రాంతంలోని గోకుల్ థియేట‌ర్లో జాను సినిమా చూస్తూ ఓ వ్య‌క్తి ఆక‌స్మికంగా మృతి చెందాడు. దీంతో ఎస్.ఆర్. న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదైంది.

శుక్ర‌వారం `జాను` విడుద‌ల‌వ్వ‌డంతో టిక్కెట్ కొనుక్కుని మ్నాట్నీ షో చూసేందుకు థియేట‌ర్లోకి వెళ్లిన ప్రేక్ష‌కుడు విగ‌త జీవిగా క‌నిపించ‌డం అంద‌రికీ షాకిచ్చింది. సినిమా పూర్త‌యి థియేట‌ర్లో జ‌నాలంతా బ‌య‌ట‌కు వెళ్లిపోయినా ఆ వ్య‌క్తి మాత్రం క‌ద‌ల‌క‌పోవ‌డం సందేహం క‌లిగించింది. దీంతో థియేట‌ర్ సిబ్బంది ద‌గ్గ‌ర‌కు వెళ్లి లేపే ప్ర‌య‌త్నం చేయ‌గా అత‌డు ఏ ఉలుకు..ప‌లుకు లేకుండా ప‌డి ఉన్నాడు. దీంతో విష‌యం యాజ‌మాన్యానికి తెలియ‌జేసి ఎస్.ఆర్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేసారు. సిబ్బందితో థియేట‌ర్ కు వ‌చ్చిన ఎస్.ఐ మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

వివ‌రాలు కోసం అత‌ని ప్యాట్ జెబులు వెతికారు. అయితే ఎలాంటి ఆధారాలు దొర‌క‌క‌పోవ‌డంతో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృతిగా కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. అత‌ని మృతికి కార‌ణం ఏమై ఉంటుంది? థియేట‌ర్లో గుండె పోటు వ‌చ్చి మృతి చెందాడా? ఒక‌వేళ గుండె పోటుతో చ‌నిపోతే దానికి కార‌ణం ఏమై ఉంటుంది? లేక సైలెంట్ గా ఆత్మ‌హ‌త్య‌ కు పాల్పడ్డాడా? అన్న అన్ని కోణాల్లో విచార‌ణ చేప‌డుతున్నార‌ట‌.
Tags:    

Similar News