జనసేన పార్టీ జయాపజయాలతో సంబంధం లేకుండా ఇకపై తాను సినిమాలు చేయను అని పవన్ కళ్యాణ్ పబ్లిక్ గా ప్రెస్ నోట్ రూపంలో ప్రకటించినప్పటికీ మళ్ళీ కం బ్యాక్ చేయకపోడా అనే అనుమానాలు మాత్రం వ్యక్తమవుతూనే ఉన్నాయి. దానికి తగ్గట్టు కొందరు దర్శకులు పవన్ కు కథలు సిద్ధం చేసే పనిలో ఉన్నారనే వార్తలు అభిమానులను అయోమయానికి గురి చేస్తున్నాయి. వాల్మీకి దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పుడు పవర్ స్టార్ కోసం సబ్జెక్టు రెడీ చేసే పనిలో ఉన్నాడని ఒకవేళ అంతా ఓకే అయితే మైత్రి బ్యానర్ లో వచ్చే ఏడాది ఇది స్టార్ట్ అవ్వొచ్చని కొత్త ప్రచారం ఊపందుకుంది.
మైత్రి పవన్ కు అడ్వాన్స్ ఇచ్చిన మాట వాస్తవమే కానీ అదెప్పుడో కాటమరాయుడి కన్నా ముందు. ఇప్పుడు పవన్ మనసు మారిపోయింది. జనసేన తరఫున అఫీషియల్ స్టేట్ మెంట్ జారీ చేస్తూ పవన్ ఇకపై సినిమాల్లో నటించడు అని చెప్పినా సరే ఇప్పుడీ ప్రచారం జరగడం చూస్తే మరో కొత్త రచ్చకు దారి తీసేలా ఉంది. హరీష్ శంకర్ మాత్రం దీని గురించి మాట్లాడే పరిస్థితిలో లేడు. ఒకపక్క వాల్మీకి ప్రమోషన్స్ దాని రిజల్ట్ గురించిన టెన్షన్ తో సెప్టెంబర్ 20 కోసం ఎదురు చూస్తున్నాడు.
నిజంగా పవన్ ఎస్ చెప్పాలి కానీ గబ్బర్ సింగ్ తరహాలో మరో పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయడం కష్టమేమి కాదు. కానీ వాస్తవంగా ఇది జరుగుతుందా అనేది మాత్రం అనుమానమే. పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నాడు. ఎక్కడా సినిమాలకు మళ్ళీ రావడం గురించి ఎలాంటి క్లూ ఇవ్వడం లేదు. అన్నయ్య ప్రతిష్టాత్మక చిత్రం సైరాకు మద్దతు తెలుపుతూ దానికి అండగా ఉండటం తప్పించి ఇంకే రకంగానూ పవన్ పరిశ్రమలో ఫోకస్ పెట్టడం లేదు. మరి ఈ కం బ్యాక్ వార్తల వెనుక పరమార్థం ఏమిటో