టాలీవుడ్ లో ట్రెండింగ్స్ అనేవి కొన్ని కొన్ని సంవత్సరాల పాటు సాగుతాయి. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ తీసిన కౌబాయ్ చిత్రాలు ట్రెండింగ్. ఇక ఆ తర్వాత కాలంలో చిరంజీవి మాస్ మసాలా 'మొగుడు, యముడు, కొదమసింహం ' ఇలా కొన్ని చిత్రాల హవా నడించింది. ఇక ఆ తర్వాత వెంకటేశ్ 'ప్రేమించుకుందాం.. రా' అంటూ చివర్లో 'రా' పేరుతో ప్రేమకథ చిత్రాలు వరుస కట్టాయి. శివతో రాంగోపాల్ వర్మ తీసిన కాలేజీ బ్యాక్ డ్రాప్, రౌడీ యిజం స్టోరీలు సూపర్ హిట్. ఇప్పట్లో అర్జున్ రెడ్డి ఆధునిక ప్రేమికుడి లవ్, ఎమోషనల్ కథ సంచలనమైంది.
ఇక బాహుబలి వచ్చాక టాలీవుడ్ యే కాదు.. దేశవ్యాప్తంగా ఇలా చారిత్రక, పురాతన స్టోరీలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. సైరా, థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ వరుస కట్టాయి. ఇక ఇవి కాకుండా హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీల ట్రెండ్స్ కొనసాగుతున్నాయి.
అయితే కామెడీ టైమింగ్ సినిమాల కొరత మాత్రం టాలీవుడ్ లో వేధిస్తోంది. అప్పట్లో రాజేంద్రప్రసాద్.. ఇప్పట్లో అల్లరి నరేష్.. ఇద్దరూ ఇప్పుడు హీరోలుగా కనుమరుగై నటులుగా సీరియస్ పాత్రలు చేస్తున్నారు. దీంతో టాలీవుడ్ లో కాసింత కామెడీ టైమింగ్ మిస్ అయ్యిందన్న అసంతృప్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
దాన్ని భర్తీ చేసేందుకు ఇటీవలే అనిల్ రావిపూడి 'ఎఫ్2'తో వచ్చాడు.. వినోదాన్ని పంచాడు. హిట్ కొట్టాడు. ఇప్పుడు ఆయన తన తదుపరి చిత్రం 'సరిలేరు నీకెవ్వరూ' కూడా కామెడీ టైమింగే అన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఇక బేసిక్ గా కామెడీ రైటర్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన త్రివిక్రమ్ దర్శకుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న సమయంలోనే తనకు ఎంతో పట్టున్న బలమైన కామెడీ టైమింగ్ ను వదిలేశాడన్న అసంతృప్తి ప్రేక్షకుల్లో ఉంది. అందుకే ఇప్పుడు దాన్ని భర్తీ చేసేలానే అల్లు అర్జున్ తో కలిసి 'అల.. వైకుంఠపురం' మూవీ తీస్తున్నారు. తొలి టీజర్ లోనే అల్లు అర్జున్ తో మాటల తూటాలను ప్రయోగించి కామెడీ జనరేట్ చేయించి తన రూటు మళ్లీ కామెడీ వైపే త్రివిక్రమ్ చెప్పకనే చెప్పాడు.
ఇప్పుడు సంక్రాంతి కానుకగా వస్తున్న త్రివిక్రమ్, అనిల్ రావిపూడి రెండు చిత్రాలు కామెడీ ప్రధానంగా వస్తున్నవే. త్రివిక్రమ్ లోని మాటల మాంత్రికుడి మహిమ ప్రేక్షకులకు కనువిందు చేస్తుందా.. అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ ప్రేక్షకులను మెప్పిస్తుందా అన్నది సంక్రాంతికి తేలబోతోంది.