నిఖిల్ సరసన స్పై చిత్రంలో నటించింది ఐశ్వర్య మీనన్. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని చరణ్ తేజ్ ఉప్పలపాటి- రాజ శేఖర్ రెడ్డి భారీ స్థాయిలో నిర్మించారు. టీజర్ ట్రైలర్ ఆకట్టుకున్నాయి. జూన్ 29న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో ఐశ్వర్య మీనన్ తెలిపిన సంగతులివి.
*స్పై నా మొదటి తెలుగు సినిమా. నా తొలి పరిచయం ఒక కలలాంటిది. దర్శకుడు గ్యారీ బిహెచ్ ఈ సినిమా సైన్ చేయగానే నన్ను హీరోయిన్ గా అనుకున్నారు. ఈ కథ ఆయన చెప్పగానే విని థ్రిల్లయ్యాను. రెండో ఆలోచన లేకుండా సంతకం చేసాను.
*ఈ చిత్రంలో నా పాత్ర యాక్షన్ - స్టంట్స్ చేయాలి. రా ఏజెంట్ గా కనిపించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. గన్ షూటింగ్ లో దాదాపు ఆరు నెలలు శిక్షణ తీసుకున్నాను. రా ఏజెంట్ గా కనిపించాలంటే దానికోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకున్నా. ఆసక్తికర ప్రయాణమిది.
*ఎలాంటి గుర్తింపుని ఆశించకుండా దేశానికి సేవ చేసే 'రా' వింగ్ గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాను. నేను స్టంట్స్ నేర్చుకున్నాను కాబట్టి యాక్షన్ సినిమాలపై ఇక నమ్మకం పెరిగింది. స్పై 2 తెరకెక్కేందుకు ఛాన్సుంది. ఒకవేళ సీక్వెల్ తీస్తే నాకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నా.
*నిఖిల్ గురించి చెప్పాలంటే అతడు తెలివైన నటుడు. హ్యాపీ డేస్ నుంచి తన పనిని చూస్తున్నాను. ఆయన కథల ఎంపిక చాలా బాగుంటుంది. చాలా పాజిటివ్ పర్సన్ . చాలా ఎనర్జిటిక్. తనతో కలిసి నటించడం సౌకర్యంగా ఉంటుంది. సాంకేతిక నిపుణుల్లో శ్రీచరణ్ పాకాల గారు నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఆయన తూ ముజే ఖూన్ ధో పాట చేశారు. అలాగే విశాల్ చంద్రశేఖర్ రెండు పాటలు చేశారు. స్పై సంగీతం అద్భుతంగా కుదిరింది.
*సవాళ్ల గురించి మాట్లాడాలంటే...? రా ఏజెంట్ గా కనిపించడం ఒక సవాల్ లాంటిది. ఇదివరకూ నేను ఇలాంటి యాక్షన్ సినిమాలు చేయలేదు. కదలికలు.. ఫైటింగ్స్... యాటిట్యూడ్ అన్నీ రా ఏజెంట్ లా సహజంగా ఉండేలా చూసుకోవడం ఛాలెంజింగ్. విజువల్స్ చూసుకున్నాక నాపై నాకు నమ్మకం పెరిగింది. ఇంజనీరింగ్ చేసి నటిని అయ్యాను. ఈ రంగంలో ఊహించుకోలేదు. నేను ఎప్పుడూ హీరోయిన్ అవుతానని అనుకోలేదు. ఆరంభంలో చిన్న చిన్న ప్రకటనలు చేశాను. ఒకొక్క అడుగువేసి ఇక్కడి వరకూ వచ్చాను. ఈ ప్రయాణం సంతోషాన్నిస్తోంది.
*భవిష్యత్ లో అన్నిరకాల పాత్రల్లో నటిస్తాను. అలియా భట్ చేసిన హైవే తరహ పాత్రలు పోషించాలని వుంది. నాకు అందరు హీరోలతో అవకాశాలు కావాలి. తదుపరి యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో కార్తికేయ హీరోగా ఒక సినిమా చేస్తున్నా. ఇతర భాషల్లోను అవకాశాలొస్తున్నాయి... అని చాటింగ్ ముగించారు.