#స్క్విడ్ గేమ్ -2 .. ఊచ‌కోత‌కు సిద్ధం కండి!

Update: 2022-06-13 06:46 GMT
ఇది అధికారికం! నెట్ ఫ్లిక్స్ 2021 దక్షిణ కొరియా బ్రేక్ అవుట్ షో `స్క్విడ్ గేమ్` రెండవ సీజన్ లాంచ్ ఖ‌రారైంది. జూన్ 12 ఆదివారం నాడు మేక‌ర్స్ ఈ కొత్త సీజ‌న్ గురించి ప్రకటించారు. ఓ అధికారిక ప్రకటనలో స్క్విడ్ గేమ్ దర్శక రచయిత-ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన హ్వాంగ్ డాంగ్ హ్యూక్ .. లీ జంగ్ జే .. లీ బైయుంగ్ హున్ ల పునరాగమనాన్ని ధృవీకరించారు. అతను గాంగ్ యూ రీఎంట్రీతో మరొక ఘోరమైన ఎపిసోడ్ ఉంటుందని కూడా తెలిపాడు.

గత సంవత్సరం విడుద‌లైన `స్క్విడ్ గేమ్ మొదటి సీజన్` కు జీవం పోయడానికి 12 ఏళ్లు పట్టింది. కానీ స్క్విడ్ గేమ్ అత్యంత ప్రజాదరణ పొందిన నెట్ ఫ్లిక్స్ సిరీస్ గా అవతరించడానికి 12 రోజులు పట్టింది. అందుకే స్క్విడ్ గేమ్ ద‌ర్శ‌క‌నిర్మాత కం ర‌చ‌యిత తాజా  ప్ర‌క‌ట‌న‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు దిల్ ఖుష్ అందించింద‌నే చెప్పాలి.

మా షోని వీక్షించినందుకు.. ప్రేమిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు గి-హన్ తిరిగి వస్తాడు. ఫ్రంట్ మ్యాన్ తిరిగి వస్తాడు. సీజన్ 2 వస్తోంది. డ్డాక్జీతో సూట్ లో ఉన్న వ్యక్తి తిరిగి రావచ్చు. మీరు కూడా ఉంటారు.. యంగ్-హీ బాయ్ ఫ్రెండ్ .. చియోల్-సుకి ల‌ను పరిచయం చేసాం. సరికొత్త రౌండ్ కోసం మరోసారి మాతో చేరండి.. అని ఆయన ఒక ప్రకటనలో ఎగ్జ‌యిటింగ్ గా తెలిపారు.

లీ జంగ్ జే పాత్ర పునరాగమనంపై మొదటి సీజన్ ముగింపులో ఆటపట్టించారు. కానీ అక్కడ అతను క్రూరమైన గేమ్స్ ను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది. లీ బైయుంగ్ హున్ పోషించిన ది ఫ్రంట్ మ్యాన్ 45.6 బిలియన్ల నగదు బహుమతిని గెలుచుకోవడం కోసం 456 మంది నగదు రహిత ఆటగాళ్లను ఒకరిపై ఒకరిని పోటీకి దింపిన ఘోరమైన గేమ్ లకు ప్రధాన క‌ర్త‌.. విల‌న్ కం బాస్. స్క్విడ్ గేమ్ సృష్టికర్త తన సొంత దుష్ట కవల సోదరి వలె సిరీస్ లో ఉత్తర కొరియా శరణార్థి పోటీదారుగా నటించే జంగ్ హో యెన్  పునరాగమనంపైనా హింట్ ఇచ్చారు.

అక్టోబర్ 2021లో నెట్ ఫ్లిక్స్ ప్లాట్ ఫారమ్ పై మొదటి నెలలో 111 మిలియన్ల వీక్షకులను ఆకర్షించడం ద్వారా స్ట్రీమింగ్ దిగ్గజం చరిత్రలో స్క్విడ్ గేమ్ అతిపెద్ద సంచ‌ల‌నం అయ్యిందని ధృవీకరించింది. కొరియన్ సిరీస్ మొదటి 28 రోజులలో బ్రిడ్జెర్టన్ సెట్ చేసిన గ‌త‌ రికార్డును అధిగమించింది.

ఈ షోని అరంగేట్రం తర్వాత 82 మిలియన్ల కుటుంబాలు చూసాయి.. నవంబర్ 2021లో నెట్ ఫ్లిక్స్ 1.6 బిలియన్ గంటల వీక్షకులతో స్క్విడ్ గేమ్ అత్యధికంగా వీక్షించిన‌ ప్రదర్శన లేదా చలనచిత్రంగా సంచ‌ల‌నం సృష్టించిందని ధృవీకరించింది.
Tags:    

Similar News