సినిమాలను కష్టపడి ఎంత బాగా తీసినా కూడా ప్రమోషన్ విషయంలో ఫెయిల్ అయితే ఆ కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే. స్టార్ హీరోల సినిమాలు మేకర్స్ ప్రమోట్ చేసినా చేయకున్నా అవి జనాల్లోకి వెళ్తాయి. కాని చిన్న సినిమాలను మాత్రం ఖచ్చితంగా విభిన్నమైన రీతిలో ప్రమోట్ చేయాలి. అందరి దృష్టిని ఆకర్షించేలా కొత్త తరహాలో ప్రమోషన్స్ నిర్వహించాలి. ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి సినిమా విడుదల అయ్యే వరకు కూడా జనాలు ఆ సినిమా గురించి ఆలోచించే విధంగా ప్రమోషన్ ఉండాలి. తాజాగా వచ్చిన ‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉందే అనేలా ఉంది.
రాజావారు రాణిగారు చిత్రంతో హీరోగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరం హీరోగా ట్యాక్సీవాలా ఫేం ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిన్న చిత్రమే ఈ ఎస్ ఆర్ కళ్యాణ మండపం. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విభిన్నంగా విడుదల చేశారు. ఈమద్య కాలంలో మీమ్స్ బాగా ఫేమస్ అవుతున్నాయి. అందుకే మీమ్స్ తరహాలోనే ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
పోస్టర్ లో హీరోయిన్ లైబ్రెరిలో ఈ బుక్ ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంది.. ఎలాగైనా ఈ రోజు చదవాలని అనుకుంటూ ఉండగా అక్కడే లైబ్రెరీలో ఉన్న హీరో ఆ అమ్మాయి నడుము చూస్తూ అబ్బా.. ఈ నడుమేదో షానా ఇంట్రెస్టింగ్ గా ఉండాది.. ఎట్టయినా ఈ రోజు తాకాలి అన్నట్లుగా అనుకుంటూ ఉన్నట్లుగా మీమ్ పోస్టర్ ను క్రియేట్ చేశారు.
ఈ పోస్టర్ లోనే అమ్మాయి బాగా చదివే చదువుల తల్లి.. అబ్బాయి లైబ్రెరీలో కూడా అమ్మాయిల వంక చూసే బేవర్స్. వీరిద్దరి మద్య ప్రేమ ఎలా మొదలైంది అనేది సినిమా అని చెప్పకనే చెప్పారు. ఈ పోస్టర్ చూసిన నెటిజన్స్ ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.