హీరో అవ్వడం అనేది వెయ్యి జన్మల పుణ్య ఫలం! అని అన్నారు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత. హీరో అవ్వడానికి పెట్టి పుట్టాలి. అది ఎవరికో కానీ దక్కని ఒక వరం..! అంటూ తనదైన శైలిలో 'హీరో' గురించి ఎమోషనల్ గా వర్ణించారు సదరు నిర్మాత.
నిజానికి హీరో అవ్వాలని కలలు కనని వారు ఉంటారా? నూనూగు మీసాల యుక్తవయసులో ప్రతి ఒక్కరూ హీరోనే. ముఖ్యంగా తెలుగు యువతకు సినిమాతో ఉన్న కనెక్షన్ అలాంటిది. ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడ సినిమాతో అనుబంధం పెనవేసుకుంటుంది గనుక ఎవరికి వారు హీరో అని ఫీలవుతారు కూడా. డబ్బుంటే హీరో అవుతారు.. అనుకుంటే పొరపాటే గట్స్ ఉంటేనే హీరో అవుతారు! అనేది పక్కా గా ప్రూవ్ అయిన నిజం. చిరంజీవి- రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్లే దీనికి ఎగ్జాంపుల్. ఇక హీరో అవ్వాలనుకున్న ఓ వ్యాపారవేత్త ప్రాక్టికల్ గా చేసి చూపించాడు. తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త శరవణన్ హీరో కావాలన్న తన కలను నెరవేర్చుకున్నాడు. అంతేకాదు ఇద్దరు హాటెస్ట్ భామలతో రొమాన్స్ కూడా చేసాడు.
అయితే ఉన్నట్టుండి ఆయన 51 వయసులో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారన్నది తమిళనాడులో ఒక సంచలన వార్తగా మారింది. మీడియాలో పుంఖాను పుంఖాలుగా కథనాలొచ్చాయి. అసలు సినీనేపథ్యం లేనే లేదు. నటుడు అయ్యే వాసన కూడా అంతకుముందు లేదు.
కానీ అతడు అనూహ్యంగా హీరో అయ్యాడు. అది కూడా 50 ప్లస్ ఏజ్ లో అంటూ రాసారు. శరవణన్ హీరోగా దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో రజనీకాంత్ లెవల్లో భారీ బడ్జెట్ చిత్రం తీసి రిలీజ్ చేసారు. అది కూడా బహుభాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసి శరవణన్ అంటే ఎవరో దేశంలో మారు మూల విలేజీలకు కూడా తెలిసేలా చేసారు. ఓవర్ నైట్ లో అతడు పాపులరయ్యాడంటే అది సినిమా పుణ్యమే.
మొత్తానికి హీరో అవ్వాలన్న తన కలను శరవణన్ నిజం చేసుకున్నారు. వందల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా పెండింగ్ లో ఉన్న తన అమూల్యమైన కలను సాకారం చేసుకోవడం ఆయనకు సులువే అయినా కానీ 60కోట్ల బడ్జెట్ ఇంతకీ రీకవరీ అయ్యిందా లేదా? అంటూ నోళ్లు నొక్కుకునేవాళ్లకు కొదవేమీ లేదు. అసలు డబ్బు పెట్టింది తిరిగి రావడానికేనా? అని కూడా కొందరు లాజిక్ ని ప్రశ్నించే వాళ్లు లేకపోలేదు. ఏది ఏమైనా హీరో శరవణన్ పై సోషల్ మీడియాల్లో జోకులు సెటైర్లతో కూడుకున్న ఈమోజీలు హల్ చల్ చేస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
వీటన్నిటినీ మించి శరవణన్ నటించిన ఒక సన్నివేశానికి చెందిన వీడియో క్లిప్ బోలెడంత ఫన్ ని పుట్టిస్తోంది వెబ్ లో. అది భార్య చనిపోయే సన్నివేశం. అక్కడ హీరో తన బాధను వ్యక్తం చేస్తూ ఏడ్వాల్సి ఉంటుంది. ఇందులో శరవణన్ నటనకు థియేటర్లలో ఆడియెన్ కడుపు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఇక ఇదే వీడియో క్లిప్ ని వెబ్ లో సోషల్ మీడియాల్లో చూసి కూడా నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం ఈ క్లిప్ అంతర్జాలంలో హల్ చల్ చేస్తోంది. అయితే అలా నవ్వుకునేవాళ్లకు తెలియని నిజాలు ఎన్నో ఉంటాయి ఈ రంగుల ప్రపంచంలో. ఇది ఒక మాయావనం!!