దసరా పండుగ సందర్భంగా కింగ్ నాగార్జున మంగళవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరైన విషయం తెలిసిందే. ఇంటి సభ్యులు చేసిన వంటలు తిన్న నాగ్ బుధవారం ఎపిసోడ్ లో ఇంటి సభ్యులతో సరదా గేమ్ ఆడించారు. అయితే మొదటిగా వాళ్లతో పాసింగ్ గేమ్ ఆడించారు. గేమ్ లో భాగంగా పాట ఎవరి దగ్గరైతే స్టాప్ అవుతుందో వాళ్లకు ఇచ్చిన టాస్క్ ను చేయాల్సి ఉంటుంది. దీంతో సాంగ్ అలీ దగ్గర ఆగింది. కళ్ళకు గంతలు కట్టుకుని మహేష్ కు మేకప్ వేయాలని నాగార్జున ఫన్నీ టాస్క్ ఇచ్చారు. ఇక అలీ కళ్లకు గంతలు కట్టుకుని మహేష్ కి పిచ్చిపిచ్చిగా మేకప్ వేసేశాడు.
తర్వాత సాంగ్ వరుణ్ దగ్గర ఆగగా...అతనికి ఫ్రూట్ గేమ్ ఇచ్చారు. కేక్ - బ్రెడ్ - అరటిపండు (ఫ్రూట్) ఇచ్చి.. వితికా కాకుండా ఎవరితోనైనా తినిపించుకోవాలని టాస్క్ ఇచ్చారు. దీంతో శ్రీముఖి వెనుకకు తిరిగి ఉండగా - ఆమెను గైడ్ చేస్తూ వరుణ్ అన్ని చక్కగా లాగించేశాడు. తర్వాత శివజ్యోతికి ఐదు రకాల పచ్చికూరగాయలు తినే టాస్క్ ఇవ్వగా - బాబా భాస్కర్ పిండిలో తలపెట్టి కాయిన్ తీశారు. వితికా - మహేష్ - రాహుల్ కు సైతం వెరైటీ టాస్క్ లు ఇచ్చారు.
ఇక ఈ టాస్క్ లో భాగంగా చివరిగా మిగిలిన శ్రీముఖిని బెల్లీ డాన్స్ చేయాలని నాగార్జున కోరారు. దీంతో మొదట శ్రీముఖి డ్యాన్స్ చేయడానికి భయపడింది కానీ...తర్వాత మాత్రం రెచ్చిపోయి డ్యాన్స్ వేసింది. ‘ఈ వెన్నెల రాత్రికి.. ఆ చంద్రుని వేడికి.. కావాలా కౌగిలి’ అంటూ నడుమును బొంగరంలా తిప్పుతూ అందరి చూపుని తిప్పుకోకుండా చేసింది.