బిగ్‌ బాస్‌: సిగ్గు పడిన శ్రీముఖి..బాబా పంచ్‌ లు

Update: 2019-09-27 05:20 GMT
బిగ్ బాస్ షో రోజు రోజుకు ఆసక్తికరంగా సాగుతుంది. గత మూడు రోజులుగా ‘అత్త రాజ్యంలో కోడళ్ళ పాట్లు’ టాస్క్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ టాస్క్ లో భాగంగా ఇటుకలతో గోడ కడుతున్న సందర్భంలో వరుణ్-రాహుల్ బలప్రదర్శనకు దిగారు. ఈ సమయంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇక చాలా సమయం వీరి మధ్య మాటల యుద్ధం నడిచింది. గురువారం ఎపిసోడ్ లో కూడా ఆ గొడవ గురించి ఇంట్లో చర్చ జరిగింది. ఒకవైపు వరుణ్-వితికా జంట..మరో జంటగా ఉన్న రవి-శ్రీముఖిలతో డిస్కషన్ చేశారు.

అలాగే మరో జంట రాహుల్-పునర్నవిలు కూడా మరోవైపు చర్చ పెట్టుకున్నారు. ఇంట్లో మనమిద్దరమే ఒంటరి అయిపోయామని - ఇంట్లో అందరూ కలిసి ఉన్నారని పున్నూ..రాహుల్ తో చెప్పింది. అయితే అవనివ్వు - ఇక గేమ్ ఆడొద్దు అంటూ రాహుల్ వదిలేశాడు. అయితే చివరికి పున్నూ..రాహుల్ ని ఒప్పించి గేమ్ ఆడించింది. తర్వాత టాస్క్ లో భాగంగానే అత్తగా ఉన్న శివజ్యోతి.....తమ కొడుకులు పెళ్లి చూపులు ఎలా జరిగాయో తనకు చూపించాలని చెప్పింది. దీంతో శివజ్యోతి పెద్ద కొడుకు - కోడలు క్యారెక్టర్లు చేస్తున్న రవి-శ్రీముఖిలు పెళ్ళిచూపులు జరిగాయి.

ఇందులో భాగంగా రవి బాబాయ్‌ గా బాబా భాస్కర్ ఉండగా - శ్రీముఖి అన్నయ్యగా మహేశ్ ఉన్నారు. ఈ పెళ్లి చూపులు కార్యక్రమంలో శ్రీముఖి తెగ సిగ్గుపడిపోయింది. దించిన తలని పైకి ఎత్తలేదు. అది చూసిన బాబా మెడ పట్టేసిందా అంటూ పంచ్ వేశాడు. తర్వాత శ్రీముఖి ఇచ్చిన కాఫీ తాగుతూ...ఇదేంటి ఇందులో చక్కెర లేదని బాబా అడుగగా...అవి వాటర్ అని శ్రీముఖి రివర్స్ పంచ్ ఇచ్చింది.

ఆ తర్వాత కట్న కానుకలు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు...బాబా అవి ఏమో గానీ ముందు ఆటోకి ఒక 500 వందలు ఇవ్వమని సెటైర్ వేశాడు. ఈ సెటైర్ కు ఇంట్లో సభ్యులు అందరూ పగలబడి నవ్వారు. చివరికి టాస్క్ ముగిసే సరికి రవి-శ్రీముఖి జంట విన్నర్లుగా నిలిచారు. ఇక వీలునామా చివరి వరకు శివజ్యోతి దగ్గరే ఉంచుకుంది. అలాగే టాస్క్ లో బెస్ట్ పర్ఫామర్ గా బాబా భాస్కర్ నిలిచాడు. దీంతో రవి - శ్రీముఖి - శివజ్యోతి - బాబా భాస్కర్ ఈ వారం కెప్టెన్ టాస్క్ లో పోటీ పడతారని బిగ్ బాస్ ప్రకటించాడు.



Tags:    

Similar News