వర్సటైల్ హీరో శర్వానంద్ ఇటీవల 'శ్రీకారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కెరీర్ ఆరంభం నుంచి విభిన్నమైన రోల్స్ లో నటిస్తూ వస్తున్న శర్వా కు ఈ సినిమాలోని పాత్రకు గాను మంచి పేరు వచ్చింది. వ్యవసాయం చేయడం కోసం ఐదంకెల జీతం వచ్చే సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలేసే యువకుడి పాత్రలో యువ హీరో నటన అలరించింది. స్ఫూర్తిదాయకమైన అంశాలతో నూతన వ్యవసాయ విధానానికి శ్రీకారం చుట్టిన కొత్త దర్శకుడు బి. కిషోర్ రెడ్డి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఈ మధ్యే సన్ ఎన్ఎక్స్టీ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ పెట్టబడిన ఈ సినిమా ఓటీటీలో రికార్డ్స్ క్రియేట్ చేస్తోందని తెలుస్తోంది.
సన్ ఎన్ఎక్స్ టి అప్లికేషన్ లో తక్కువ సమయంలో అత్యధికంగా వీక్షించిన చిత్రంగా శర్వా 'శ్రీకారం' నిలిచింది. ఓటీటీలో ఐదు వేర్వేరు భాషల కంటెంట్ కావల్సినంత అందుబాటులో ఉన్నప్పటికీ.. వాటిలో 'శ్రీకారం' సినిమా మిలియన్ల వ్యూస్ సంపాదించి మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సూపర్ హిట్ గా నిలిచింది. వ్యవసాయం ప్రాధాన్యతను తెలియజేస్తున్న సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారని అర్థం అవుతోంది.
'శ్రీకారం' చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట - గోపీ ఆచంట కలసి నిర్మించారు. ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ ఇందులో హీరోయిన్ గా నటించింది. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చగా.. జె యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించారు. రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాసారు. సీనియర్ నరేష్ - సాయికుమార్ - మురళీ శర్మ - రావు రమేష్ - ఆమని - సత్య - సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.