యువ కథానాయకుడు శర్వానంద్ నటిస్తోన్న తాజా చిత్రం ''శ్రీకారం''. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిశోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట - గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శర్వానంద్ యువ రైతుగా కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన 'శ్రీకారం' ప్రచార చిత్రాలు మరియు 'భలేగుంది బాలా' 'సందళ్లే సందళ్లే' సాంగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని శివరాత్రి సందర్భంగా మార్చి 11న విడుదల చేయనున్న నేపథ్యంలో 'శ్రీకారం' టీజర్ ని విడుదల చేశారు.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా 'శ్రీకారం' టీజర్ విడుదల చేయబడింది. ''ఒక హీరో తన కొడుకుని హీరో చేస్తున్నాడు.. ఒక డాక్టర్ తన కొడుకుని డాక్టర్ ని చేస్తున్నాడు.. ఒక ఇంజనీర్ తన కొడుకుని ఇంజినీర్ ని చేస్తున్నాడు.. కానీ ఒక్క రైతు మాత్రమే తన కొడుకుని రైతుని చేయడం లేదు.. ఇదొక్కటే నాకు జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోయింది'' అంటూ శర్వా చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ ప్రారంభమైంది.' తినేవాళ్ళు మన నెత్తి మీద జుట్టు అంత ఉంటే.. పండించే వాళ్ళు మన మూతి మీద మీసమంత కూడా లేరు' అని భావించే యువ రైతు సంకల్పమే ఈ సినిమా అని తెలుస్తోంది.
దీనికి మిక్కీ జె మేయర్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. జె యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించగా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్నారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి సంభాషణలు రాస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నరేష్ - సాయికుమార్ - మురళి శర్మ - రావు రమేష్ - ఆమని - సత్య - సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
Full View