బిగ్ బాస్ ఎమోషనల్ గేమ్: శ్రీముఖి నాన్ స్టాప్ ఏడుపు..

Update: 2019-10-18 04:34 GMT
బిగ్ బాస్.... కంటెస్టంట్స్ రిలేటివ్స్ ని ఇంటిలోకి పంపుతూ - వారిని ఫుల్ ఎమోషనల్ చేశారు. వరుసగా వితికా - అలీ - శివజ్యోతి - బాబా భాస్కర్ రిలేటివ్స్ ఇంటిలోకి అడుగుపెట్టగా - గురువారం ఎపిసోడ్ లో వరుణ్ బామ్మ - రాహుల్ అమ్మ - శ్రీముఖి అమ్మ ఇంటిలోకి వచ్చారు. ఇక మొదట వచ్చిన వరుణ్ బామ్మ...ఇంటిలో సరదాగా గడిపేశారు. ఆ తర్వాత రాహుల్ తల్లి కన్ఫెషన్ లో రూమ్ లో ఉండి రాహుల్‌ ని పిలిచారు. దీంతో రాహుల్ పరుగెత్తుకుంటూ తల్లి వడిలో ఒదిగిపోయాడు. ఇక ఆమె గేమ్ బాగా ఆడమని చెప్పి - ఇంటిలోకి వచ్చింది. తన కొడుకు మనసు చాలా మంచిదని - మనసులో ఒకటి పెట్టుకుని - పైకి ఒకటి మాట్లాడ‌డని చెప్పుకొచ్చారు.

అలాగే తనకు బాబా భాస్కర్ వంట చేయడం - శ్రీముఖి అల్లరి చేయడం ఇష్టమని చెప్పారు. రాహుల్ పెదవే పలికిన తీయని మాటే అమ్మ అంటూ పాట పాడి అమ్మని సాగనంపాడు.  ఇక చివరికి బిగ్ బాస్ శ్రీముఖిని ఎమోషన్ తో ఓ గేమ్ ఆడుకున్నాడు. ఆమెని పవర్ సేవ్ మోడ్ లో పెట్టి శ్రీముఖి తల్లిని ఇంటిలోకి తీసుకొచ్చి - మళ్ళీ అదే గేటు నుండి బయటకు వెళ్లిపోవాలని సూచించారు. దీంతో శ్రీముఖి బోరున ఏడ్చింది. అసలు కంట్రోల్ చేసుకోకుండా నాన్ స్టాప్ గా ఏడ్చేసింది.

కానీ బిగ్ బాస్ సర్ ప్రైజ్ ఇస్తూ - శ్రీముఖి తల్లిని ఇంకో డోర్ నుంచి ఇంటిలోకి తీసుకురావడంతో శ్రీముఖి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇక ఆమె త‌ల్లి శ్రీముఖి గేమ్ గురించి చెప్పారు. నువ్ ఆల్ రెడీ టైటిల్ గెల్చేశావని - అసలు బయట నీ రేంజ్ వేరు అంటూ శ్రీముఖిని పైకి లేపింది. బాబా భాస్కర్-శ్రీముఖి కాంబినేషన్ బయట ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని - కాని రాహుల్ నిన్ను అలా అనడం తట్టుకోలేకపోయా అంటూ శ్రీముఖి తల్లి బాధపడ్డారు.

నెక్ట్స్‌ ఆమె ఇంటి సభ్యులతో మాట్లాడుతూ.. రాహుల్ చురకలేశారు. నువ్ బిగ్ బాస్ హౌస్‌ కి వెళ్తున్నావు అంటే శ్రీముఖికు తోడు ఉంటావ్ అని ఆనందపడ్డా - కానీ నువ్ ఆమెను అంటున్న మాటలకు ఓ తల్లిగా నాకు బాధగా ఉంది అంటూ రాహుల్ కు గట్టిగానే ఇచ్చారు. ఇక ఇంటి సభ్యులందరిని పలకరించిన ఆమె చివరిగా ఈ హోటల్ టాస్క్‌లో బాబా ఇచ్చిన టీ నచ్చడంతో బిగ్ బాస్ హోటల్‌కి స్టార్ ఇచ్చారు. దీంతో బిగ్ బాస్ హౌస్ 7 స్టార్ హోటల్‌ గా మారింది.

Tags:    

Similar News