సరేగమప.. చుక్క‌ల్లో చిక్కెన‌మ్మ చంద‌మామ‌

Update: 2022-02-17 02:30 GMT
అందానికి అందం ప్ర‌తిభ చొర‌వ క‌ల‌బోస్తే చ‌క్క‌న‌మ్మ శ్రీ‌ముఖి. అందుకే యాంక‌ర్ గా ఇండ‌స్ట్రీని ఏల్తోంది. అయితే అన‌సూయ తో పోలిస్తే పెద్ద తెర వెలుగులు మ‌రీ అంత‌గా లేవ్. కానీ బుల్లితెర‌పై హ‌వా సాగుతోంది. పెద్ద‌తెర‌పైనా ప్ర‌య‌త్నం మాత్రం ఆప‌లేదు ఈ ముగ్ధ మ‌నోహ‌రి.

శ్రీముఖి ఎప్ప‌టికప్పుడు బుల్లితెర‌పై లేటెస్ట్ షోల‌తో సంద‌డి చేస్తోంది. తాజాగా జీతెలుగు సరేగమప ఈ ఆదివారం స్పెష‌ల్ గా ప్రారంభ‌మ‌వుతోంది. ఫిబ్రవరి 20 సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు మెగా లాంచ్!  కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని శ్రీ‌ముఖి అధికారిక ఇన్ స్టాలో వెల్ల‌డించింది. ఈ సంద‌ర్భంగా స్పెష‌ల్ ఫోటోషూట్ ని షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది.

చుక్క‌ల డిజైన‌ర్ లెహంగా టాప్ తో అద‌ర‌గొట్టింది శ్రీ‌ముఖి. ఈ లుక్ చూడ‌గానే కుర్రాళ్లు డ్రీమ్స్ లోకి వెళ్లిపోతున్నారు. చుక్క‌ల్లో చిక్కెన‌మ్మ చంద‌మామ‌! అంటూ ఒక అభిమాని స్పందించ‌గా.. `అందం అంటే నీవా.. నిను న్యూట‌న్ క‌నిపెట్టాడా?` అంటూ ఓ ఫ్యాన్  వ్యాఖ్యానిస్తున్నారు. ఒక అభిమాని అయితే #రాముల్లమ్మ అంటూ ప్రేమ‌గా పిలిచాడు. మొత్తానికి శ్రీ‌ముఖి స‌రికొత్త రూపం యూత్ గుండెల్లో స్టిక్ అయిపోయింది.

పెద్ద తెర‌పై నెక్ట్స్ ఏంటీ?

`ప్రేమ ఇష్క్ కాద‌ల్` చిత్రంతో స‌క్సెస్ అందుకుంది టీవీ యాంకర్ శ్రీముఖి. ప‌లువురు యువ‌తార‌ల‌తో క‌లిసి న‌టించిన ఈ సినిమాలో శ్రీ‌ముఖి పాత్ర ఆక‌ట్టుకుంటుంది. ఆ త‌ర్వాతా అడ‌పాద‌డ‌పా సినిమాల్లో న‌టిస్తున్నా బుల్లితెర యాంక‌ర్ గా బిజీ వ‌ల్ల‌ క‌థానాయిక‌గా న‌టించి చాలా కాల‌మే అయ్యింది.

ఈరోజు విడుదలైన క్రేజీ అంకుల్స్ తో  తిరిగి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనుంది ఈ బ్యూటీ. ఈ సినిమా ట్రైలర్  ఇప్ప‌టికే యూత్ లో క్రేజీ గా దూసుకెళ్లింది.

యంగ్ యాంక‌ర్ శ్రీ ముఖితో సరసస‌ల్లాపాల కోసం వెంప‌ర్లాడే 50 ఏళ్ళ `అంకుల్స్` క‌థతో తెర‌కెక్కింది. యూత్ ని ఆక‌ట్టుకుంది. మ్యాస్ట్రో లోనూ న‌టించింది. అయితే ఆ త‌ర్వాత శ్రీ‌ముఖి నుంచి ఆశించిన సినిమా ఏదీ రాలేదు. ప్ర‌స్తుతం కొన్ని సెట్స్ పై ఉన్నాయ‌ని తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంక‌ర్ లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.
Tags:    

Similar News