భరత్ అల్లుడు నిర్మాతగా బాలయ్య సినిమా?

Update: 2022-12-24 16:35 GMT
మొత్తానికి చూస్తే రాజకీయం సినిమా రెండూ తెలుగు నాట బాగా మిక్స్ అయిపోయి ఉన్నాయనుకోవాలి. లేకపోతే రాజకీయ కుటుంబానికి చెందిన బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ కి ఇపుడు సినిమా ఇండస్ట్రీ మీద మోజు పుట్టడమేంటి అంటున్నారు. శ్రీ భరత్ ఇద్దరు తాతలూ రాజకీయ ఉద్దండులు. ఒకరు కేంద్ర మంత్రిగా పనిచేసిన కావూరి సాంబశివరావు అయితే మరొకరు రెండు సార్లు ఎంపీగా ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన ఎంవీవీఎస్ మూర్తి.

వారి వారసుడిగా తానూ ఎంపీ కావాలని శ్రీ భరత్ చూశారు. 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి మరీ మంచి సంఖ్యలో ఓట్లు సాధించారు. జస్ట్ నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2024లో కూడా మరోమారు పోటీకి తయారు అని అంటున్నారు. సరే ఆ విషయం అలా ఉంటే ఇపుడు శ్రీ భరత్ తన మామ నందమూరి బాలక్రిష్ణ హీరోగా ఒక సినిమాకు నిర్మాతగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడుతున్నారు అన్న వార్త వైరల్ అవుతోంది.

బాలయ్య బోయపాటి క్రేజీ కాంబో గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ కలసి హ్యాట్రిక్ సక్సెస్ కొట్టారు. మూడు సినిమాలు వీరి కాంబోలో వస్తే మూడూ బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. ఇక నాలుగవ సినిమా వచ్చే ఏడాది జూన్ లో స్టార్ట్ అవబోతోంది. దాన్ని 14 రీల్స్ సినిమా నిర్మిస్తోంది. ఈ నిర్మాణంలో బాలయ్య అల్లుడు శ్రీ భరత్ కూడా భాగస్వామి అవుతారని అంటున్నారు.

అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా మొత్తం సినిమా పెట్టుబడిలో ఇరవై శాతం తన వాటాగా శ్రీభరత్ పెట్టబోతున్నారుట. అలా మామ సినిమాలో పెట్టుబడులు పెట్టి లాభాలను తీసుకోవాలని చూస్తున్నారు. ఇక శ్రీభరత్ సతీమణి తేజస్విని ఇప్పటికే తన తమ్ముడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తారు అని అంటున్నారు. ఆదిత్య 369 మూవీకి సీక్వెల్ గా రానున్న ఈ సినిమాకు తేజస్విని తీయబోతున్నారు అని టాక్.

అదే సమయంలో తన భర్త  శ్రీభరత్ చేత కూడా తండ్రి బాలయ్యతో బోయపాటి తీసే మూవీకి పెట్టుబడులు పెట్టిస్తున్నారు అని అంటున్నారు. ఇక తేజస్విని బాలయ్యతోనే ఉంటున్నారు. ఆమె తండ్రి షూటింగులకు వెళ్తున్నారు. అక్కడ అన్నీ జాగ్రత్తగా గమనిస్తున్నారు.

అలాగే సినిమా నిర్మాణ వ్యవహారాలను కూడా ఆమె పరిశీలిస్తున్నారుట. దాంతో ఆమె త్వరలో స్టార్ ప్రొడ్యూసర్ అవతారం ఎత్తనున్నారని చెబుతున్నారు. మొత్తానికి బాలయ్య రెండవ కుమార్తె అల్లుడూ ఇద్దరూ నిర్మాణ రంగంలోకి రావడం అంటే మెచ్చాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News