శ్రీదేవి గురించి సంపేస్తున్నారుగా...

Update: 2015-06-28 01:30 GMT
అతిలోక సుందరి శ్రీదేవికి ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులున్నారు. ఆ క్రేజు ఎప్పటికీ తరగనిది. ఆరుపదుల వయసులోనూ వన్నె తరగని అందంతో అలరిస్తూ ఇప్పటికీ కెరీర్‌ని సాగిస్తూనే ఉంది. రీఎంట్రీలోనూ ఘనమైన ఆరంగేట్రం ఇచ్చింది. అంతేకాదండోయ్‌.. తన మాతృపరిశ్రమ కోలీవుడ్‌లో ప్రస్తుతం శ్రీదేవి గురించే హాట్‌ టాపిక్‌.

శ్రీదేవి కెరీర్‌లోనే చేయనటువంటి ఘనమైన పాత్రలో నటించిందని ప్రచారం చేస్తున్నారు. విజయ్‌ కథానాయకుడిగా చింబుదేవన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పులి చిత్రంలో శ్రీదేవి రాణీ సౌమ్యాదేవి పాత్రలో నటించింది. ఈ పాత్ర కోసం శ్రీదేవి ఎంతో శ్రమించిందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. రోజూ 9గంటలకు షూటింగ్‌ అంటే వేకువఝామునే నాలుగు గంటలకు సెట్స్‌కి హాజరయ్యేది. ఆ తర్వాత దాదాపు నాలుగు గంటల పాటు మేకప్‌కే సరిపోయేది. ఒంటిపై పది కేజీల బరువు ఉన్న నగలు, కిరీటం వగైరా ధరించి సౌమ్యాదేవి పాత్రలోకి ఒదిగిపోయేది. అంతేనా ఈ పాత్ర కోసం  ఒరిజినల్‌ భంగారు ఆభరణాల్ని ఉపయోగించారు. దానికోసం నిర్మాతలు బోలెడంత డబ్బు పోశారు. ఇలా ప్రచారంలో శ్రీదేవికి సంబంధించిన ప్రతి విషయాన్ని హైలైట్‌ చేస్తున్నారు.

జగదేక వీరుడు-అతిలోక సుందరి హిట్‌ కొట్టినప్పుడు కూడా శ్రీదేవికి ఈ రేంజు ప్రచారం రాలేదేమో! ఓ రేంజులో సంపేస్తున్నారు గురూ! కాని ట్రైలర్‌లో చూస్తే శ్రీదేవి ముఖంలో అంత మ్యాటర్‌ కనిపిచంట్లేదే. చాలా కష్టపడి కలర్‌ వేస్తే కాని ఆ మాత్రం గ్లామర్‌గా కనిపించలేదే అనిపిస్తోంది.
Tags:    

Similar News