ఇది.. అది అన్న తేడా లేకుండా ఏ విషయం మీదనైనా మాట్లాడే సత్తా ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి సొంతం. వివాదాస్పద అంశాల్ని ఇట్టే కెలికిపారేయటమే కాదు.. తనకు తోచినట్లుగా మాట్లాడటమే తప్పించి.. అందులో ‘సెన్స్’ ఉందా? అన్న విషయంపై శ్రీరెడ్డి తీరును తప్పు పట్టేవారు పలువురు ఉంటారు. మరికొందరు.. ఆమె మాటల్ని సమర్థిస్తుంటారు. తాజాగా మాత్రం.. ఆమె మాటల్ని ఎక్కువ మంది సమర్థించేలా ఆమె మాటలు ఉన్నాయి. బిగ్ బాస్ 5 రన్నరప్ షణ్ముఖ్.. అతగాడి ప్రియురాలు దీప్తి సునైనాల వ్యవహారం మీడియాలో తరచూ వార్తాంశంగా మారింది.
సోషల్ మీడియాలో అయితే.. వీరికి సంబంధించి ఇష్యూ తరచూ చర్చగా మారుతోంది. బిగ్ బాస్ షోలో.. సిరితో షణ్నూ క్లోజ్ గా మూవ్ కావటం.... దీప్తి సునైనా.. అతగాడికి బ్రేకప్ చెప్పటం తెలిసిందే. ఐదేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్న వీళ్లు.. ఒకరిని ఒకరు అపార్థం చేసుకోవటం ఏమిటి? అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి వేళ.. వీరి బ్రేకప్ వ్యవహారంపై సంచలనాల శ్రీరెడ్డి రియాక్టు అయ్యారు. దీప్తి సునైనా డెసిషన్ ను తీవ్రంగా తప్పు పట్టటమే కాదు.. అలా ఎలా నిర్ణయాన్ని తీసుకుంటావని దుమ్ము దులిపేయటమే కాదు.. గతాన్ని గుర్తు చేసి.. ఆమె ఆత్మరక్షణలో పడేలా చేశారు.
బిగ్ బాస్ షోలో సిరితో షణ్ముఖ్ క్లోజ్ గా ఉండటం వల్లే దీప్తి బ్రేకప్ చెబితే.. మరి అదే షోలో అంతకు ముందు దీప్తి కూడా ఒక వ్యక్తితో క్లోజ్ గా ఉందన్న విషయాన్ని గుర్తు చేసింది. ‘నీ వరకు వచ్చేసరికి అది తప్పు కాదా?’ అని సూటిగా దీప్తిని ప్రశ్నించిన శ్రీరెడ్డి.. ‘‘ఐదేళ్లు రిలేషన్ షిప్ లో ఉన్నానని.. ఎన్నో ఎత్తు పల్లాలు చూశామని నువ్వే చెప్పావు. బిగ్ బాస్ లో జరిగిన దానికి షణ్ముఖ్ కు బ్రేకప్ చెప్పావని క్లియర్ గా అర్థమవుతోంది. మరి.. నువ్వు బిగ్ బాస్ కు వెళ్లినప్పుడు ఒక వ్యక్తితో నువ్వు ఎంత క్లోజ్ గా ఉన్నావో.. మీ రిలేషన్ షిప్ ఏంటో అందరం చూశాం. అది లవ్ ఏమో అని జనాలకు అనుమానం వచ్చేట్టుగా ప్రవర్తించావు. నీ వరకు వచ్చేసరికి అది తప్పుగా అనిపించలేదా?’ అని కడిగినంత పని చేసింది శ్రీరెడ్డి.
పెళ్లి కాలేదు కాబట్టి బ్రేకప్ చెప్పిందని. అదే పెళ్లై ఉంటే షణ్ముఖ్ ను వదిలేసేదానివా? అంటూ దీప్తిని క్వశ్చన్ చేసింది. మనిషి అన్నాక తప్పులు చేస్తుంటారని.. ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ ఉంటే ఒకరి తప్పుల్ని ఒకరు క్షమించుకోవలేకానీ ఇలా చేయకూడదని పేర్కొంది. కొన్ని సందర్భాల్లో ఓపికతో ఉంటే.. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పింది. ఇంతకాలం షణ్ముఖ్ తీరుపై క్వశ్చన్లు వేస్తున్న వారు.. శ్రీరెడ్డి మాటల్ని విన్నాక.. దీప్తిని వేలెత్తి చూపటం ఖాయమని చెప్పక తప్పదు. ఏమైనా.. తాజా ఎపిసోడ్ లో శ్రీరెడ్డి సెన్సుబుల్ గా మాట్లాడిందన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉండటం గమనార్హం.