టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై, ప్రత్యేకించి తెలుగు అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయంపై నటి శ్రీరెడ్డి కొద్ది రోజులుగా సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు అమ్మాయిలను వాడుకొని అవకాశాలు ఇవ్వడం లేదని, టాలీవుడ్ లో ఈ విష సంస్కృతి పోవాలని తాను పోరాటం చేస్తున్నానని పలు టీవీ చానెళ్ల లైవ్ డిబేట్లలో శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై టాలీవుడ్ పెద్దలు స్పందించకపోతే నడిరోడ్డుపై అర్ధనగ్న ప్రదర్శన చేస్తానని ప్రకటించింది. చెప్పినట్లుగానే నిన్న ఫిల్మ్ చాంబర్ వద్ద శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కేవలం తెలుగు మీడియాలోనే కాకుండా, జాతీయ మీడియాలో కూడా శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనపై కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో, తాజాగా శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో మరో పోస్ట్ చేసింది.
`` ఈ అర్ధ నగ్న ఆందోళన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో నా పరిస్థితి ఎలా ఉండబోతోందో తెలీదు. ఈ ఆందోళన ద్వారా సినిమాల్లో నటించే అవకాశాలు రావాలని నేను ఆశించడం లేదు. నా శరీరాన్ని విమర్శించవద్దు. నాకు నటించాలని ఆసక్తి లేదు. ఒకవేళ అవకాశాలు వస్తే నటిస్తా. లేదంటే లేదు. ఇది టాలీవుడ్ కు బ్లాక్ డే. నన్ను టాలీవుడ్ నడిరోడ్డుపై అర్ధనగ్నంగా నిలబెట్టింది. ఇది నాకు జరిగిన అవమానం కాదు. తెలుగు కళామతల్లికి, తెలుగు మహిళలకు జరిగిన అవమానం. తెలుగు అమ్మాయిల కోసం జరుగుతున్న ఈ పోరాటంలో కీలకమైన పాత్ర పోషిస్తాను. ఇప్పటివరకూ టాలీవుడ్ కు చేతనైనంత సేవ చేశాను. ఏది ఏమైనా నా పోరు కొనసాగుతుంది. తమిళనాడులో జల్లికట్టు తరహాలో తెలుగు హీరోయిన్లకు మద్దతుగా నిరసనలు తెలపండి`` అంటూ శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. నిన్నటి అర్ధ నగ్న ప్రదర్శన, తాజా పోస్ట్ ల నేపథ్యంలో శ్రీరెడ్డి ఉదంతంపై టాలీవుడ్ పెద్దలు, `మా` స్పందన ఎలా ఉంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.