నాగబాబు వ్యాఖ్యలపై శ్రీరెడ్డి మళ్లీ రెచ్చిపోయింది

Update: 2019-01-09 14:11 GMT
బాలకృష్ణపై నాగబాబు గత కొన్ని రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలపై శ్రీరెడ్డి చాలా సీరియస్‌ గా స్పందించింది. బాలకృష్ణ ఎవరో తెలియదు అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ గా పవన్‌ అంటే ఎవరో కూడా తనకు తెలియదు అన్నట్లుగా కామెంట్‌ చేసి చర్చనీయాంశం అయ్యింది. గతంలో జగన్‌ మరియు తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడుపై పవన్‌ కళ్యాణ్‌ చేసిన ఆరోపణలు గురించి కూడా శ్రీరెడ్డి ప్రస్థావిస్తూ వీడియోను తన ఫేస్‌ బుక్‌ లో పోస్ట్‌ చేసింది. సోషల్‌ మీడియాలో నాగబాబు వ్యాఖ్యలపై వరుసగా శ్రీరెడ్డి సీరియస్‌ గా తనదైన శైలిలో స్పందిస్తూ వస్తోంది.

శ్రీరెడ్డి తాజాగా వీడియోలో నాగబాబుతో పాటు పవన్‌ కళ్యాణ్‌ పై మరింతగా విరుచుకు పడినది. చిరంజీవి - పవన్‌ కళ్యాణ్‌ లను బాలయ్య బాబుగారు ఎప్పుడో ఏదో మాట అన్నారని మీరు ఇప్పుడు తెగ గగ్గోలు పెడుతున్నారే. మరి మీ తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ గతంలో కాంగ్రెస్‌ నాయకులను పంచలూడదీసి పరిగెత్తిస్తానన్నాడని - జగన్‌ పై తీవ్రమైన విమర్శలు చేశారు. దానికి మీ సమాధానం ఏంటి.

సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరిది ఫిల్మ్‌ ఛాంబర్‌. మరి మీ పవన్‌ కళ్యాణ్‌ ఎవరండీ లోనికి వెళ్లి తలుపులు వేసుకునేందుకు - ఆయన ఏ అర్హత మీద లోనికి వెళ్లారో చెప్పండి. ఇండస్ట్రీలో మీ దందాకు బాలకృష్ణ గారు ఏమైనా అడ్డు వచ్చారా - పవన్‌ కళ్యాణ్‌ కు గౌరవం ఇచ్చి - సింగిల్‌ మాటలో పవన్‌ ఎవరో నాకు తెలియదు అంటూ బాలకృష్ణ గారు అన్నారు. అదే వేరే ఎవరైనా అయితే మరీ సీరియస్‌ గా స్పందించేవారు. బాలయ్య బాబును అనేంత స్థాయి మీకు లేదు. ఏదో వరుసగా వీడియోలు వదిలినంత మాత్రాన బాలయ్య బాబు గారు భయపడతారనుకుంటున్నావా. బాలయ్య గారు - ఆయన అభిమానులు ఇంత సైలెంట్‌ గా ఉన్నారంటే మీ లక్‌ - వారంతా మిమ్ములను క్షమిస్తున్నారు. జబర్దస్త్‌ లో సోది కామెడీకి తెగ నవ్వే వాడివి నువ్వు ఇప్పుడు గౌరవం - అదీ ఇది అంటూ మాట్లాడుతున్నావా అంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. నాగబాబు, బాలకృష్ణ మద్యలో ఈ శ్రీరెడ్డి గొడవ ఏంటా అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.


Full View

Tags:    

Similar News