మాజీ అందాల తార శ్రీదేవి నటించిన లేటెస్ట్ మూవీ మామ్. ఈ సీనియర్ భామ నటించిన 300వ సినిమాగా వచ్చిన మామ్.. థియేటర్లలో బాగానే సందడి చేస్తోంది. రివ్యూలు గొప్పగా లేకపోయినా.. వసూళ్లు మాత్రం బాగానే ఉన్నాయి. ఇప్పుడు శ్రీదేవి మరుసటి ప్రాజెక్ట్ కూడా ఖాయమైపోయినట్లు తెలుస్తోంది. తన మరుసటి చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ కు చేయనుందట ఈ 50+ బ్యూటీ.
బాలీవుడ్ లో వినిపిస్తున్న సౌండ్స్ ప్రకారం అయితే.. విభజనకు సంబంధించిన కథపై అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో శ్రీదేవి నటించనుంది. కరణ్ జోహార్ సంస్థలోనే 2 స్టేట్స్ అంటూ మంచి హిట్ సాధించిన ఈ దర్శకుడు.. ఇప్పుడు మళ్లీ భారీ తారాగణంతో కొత్త సినిమా చేస్తున్నాడు. తన తండ్రి ఆలోచన ఇన్నేళ్లకు సాకారం అవుతోందని కూడా చెప్పాడు కరణ్ జోహార్. ఈ చిత్రంలో ఇప్పటికే సోనాక్షి సిన్హా.. వరుణ్ ధావన్.. ఆలియా భట్ లు భాగం కాగా.. సంజయ్ దత్ ను కూడా అప్రోచ్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు తాజా వినిపిస్తున్న కబుర్లేంటంటే.. సంజయ్ దత్-శ్రీదేవి ఈ చిత్రంలో జంటగా నటించనున్నారని అంటున్నారు.
దాదాపు పాతికేళ్ల క్రితం.. అంటే 1993లో వచ్చిన గుమ్రాహ్ చిత్రంలో సంజయ్ దత్- శ్రీదేవి కలిసి నటించారు. మళ్లీ ఇన్నేళ్లకు వీరిద్దరు జట్టు కడుతుండగా.. గుమ్రాహ్ కూడా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే రూపొందడం యాదృచ్ఛికమే. అయితే.. శ్రీదేవి మాత్రం తన సినిమాల స్పీడ్ ను పెంచే ఉద్దేశ్యంలో ఉందనే సంగతి అర్ధమవుతోంది.