చెట్టు పేరు చెప్పి కాయలమ్మేస్తున్నారు

Update: 2015-07-01 11:43 GMT
ఇతర భాషల్లో మార్కెట్‌ని కొల్లగొట్టడం ఎలానో మన ఫిలింమేకర్స్‌ పట్టేశారు. పొరుగు భాషల్లో అప్పటికే ఫేమస్‌ అయిన నటీనటుల్ని ఎంపిక చేసుకుంటే అది ప్రచారానికి బాగా కలిసొస్తుంది. ఆ ముఖాల్ని ప్రజలంతా ఇట్టే గుర్తు పట్టేస్తారు కాబట్టి ప్రచారంలో కష్టపడాల్సింది ఏమీ ఉండదు. ప్రస్తుతం టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఈ ఫార్ములాని సమర్ధంగానే వినియోగిస్తున్నారు.

    లేటెస్టుగా హీరో విజయ్‌ కూడా ఇదే ఫార్ములాతో రేసులోకి దూసుకొచ్చాడు. అతిలోక సుందరి శ్రీదేవి పేరుతో బాలీవుడ్‌లో తనకి కావాల్సిన ప్రచారం చేసేసుకుంటున్నాడు ఈ హీరో. 'అలనాటి మేటి నాయిక శ్రీదేవి మహారాణి పాత్రలో నటించిన' అన్న ట్యాగ్‌లైన్‌ వాడేసి ఉత్తరాదిన పులి చిత్రానికి ప్రమోషన్‌ చేసుకుంటున్నారు. ఇప్పటికే టీజర్లలో శ్రీదేవిని హైలైట్‌ చేస్తూ అవసరమైనంత అటెన్షన్‌ని సంపాదించారు. శ్రీదేవి న్యూ గెటప్‌ని టీజర్లలో వీక్షించిన ఉత్తరాది జనం ఫిదా అయిపోయారు. అరతేకాదు శ్రీదేవికి బాలీవుడ్‌లో బలమైన నెట్‌వర్క్‌ ఉంది కాబట్టి పులి చిత్రానికి ప్రచారం చాలా సులువైపోయింది. అలాగే కథానాయికలుగా నటించిన శ్రుతిహాసన్‌, హన్సిక ఈపాటికే తెలుసు కాబట్టి అది అదనపు అస్సెట్‌ అయినట్టే.

    పులి ఆగస్టులో రిలీజ్‌ కానుంది. బాహుబలి రేంజులో మార్కెట్‌ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్త్తున్నారు. 100కోట్ల ప్రాజెక్టుని 300కోట్లకు తీసుకెళ్లాలన్న ప్రణాళికతో ముందుకు కదులుతున్నారు. పులి చివరికి ఏం చేస్తుందో వెయిట్‌ అండ్‌ సీ.

Tags:    

Similar News