వాళ్లిద్దరి ఫెయల్యూర్లూ శ్రీదేవికి లెసన్సే

Update: 2016-10-17 22:30 GMT
ఇప్పుడు తాను ఎక్కడికి వెళ్ళినా కూడా.. వీలైనప్పుడల్లా కూతురు జాన్వి కపూర్ ను వెంట పెట్టుకుని తీసుకెళుతోంది శ్రీదేవి. ఆవిడకు ఉన్న క్రేజ్ ఎలాగో తగ్గిపోయింది.. అయితే హీరోయిన్ గా డెబ్యూ చేయనున్న తన కూతురు మాత్రం తొలిసినిమాతో సూపర్ స్టార్ అయిపోవాలని కలలుకంటోంది. కాని ఆ కలల్లో ఓ రెండు లెసన్లు మాత్రం శ్రీదేవిని బాగా డిస్ర్టబ్ చేస్తున్నాయట.

శ్రీదేవి మొగుడి తమ్మడు అనిల్ కపూర్.. తన కూతురిని కొడుకును హీరోయిన్ హీరోలుగా ఇంట్రొడ్యూస్ చేసిన సంగతి తెలసింది. ఎంతో స్టార్డమ్ వస్తుందనుకొని సోనమ్ కపూర్ బాలీవుడ్ లోకి అడుగుపెడితే.. స్టార్ కిడ్ కాబట్టి వండర్ ఫుల్ లాంచ్ సినిమా (సంజయ్ లీలా భన్సాలి సావరియా) దక్కింది కాని.. అక్కడ నుండి అన్నీ చుక్కలే. పెద్ద హీరోలతో సినిమాలొచ్చినా ఈమెకు కలసిరాలేదు. కాబట్టి స్టార్డమ్ ఎంతున్నా కూడా.. కెరియర్ వైజ్ గా అనుష్క శర్మ - ఆలియా భట్ - శ్రద్దా కపూర్ కంటే సోనమ్ వెనక్కిపడిపోయింది.

తరువాత మనం సోనమ్ తమ్ముడు హర్షవర్దన్ కపూర్ గురించి చెప్పుకోవాలి. మొన్ననే మీర్జియా సినిమాతో రంగప్రవేశం చేశాడు. కాని ఆకట్టుకోలేకపోయాడు. సినిమా నిలబడలేదు.. హర్ష్ కూడా పెద్దగా ఇంప్రెస్ చేసిందేమీ లేదు. జాన్వికి అన్నయ్య అండ్ అక్క వరుస అయ్యే వీరిద్దరిలా తన కూతురు మాత్రం అయిపోకూడదని శ్రీదేవి ప్రస్తుతం వేడుకుంటోందట. అదంతా ఎవరి చేతిలో ఉంటుందిలేండి. లక్కులు కిక్కులూ కలసిరావాలంతే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News