తెలుగు సినిమా ఖ్యాతిని దేశం మొత్తం చాటిచెప్పిన చిత్రం బాహుబలి అని కొత్తగా చెప్పే పనిలేదు. ఇప్పుడు ఎక్కడకు వెళ్ళిన ఎవ్వరితో మాట్లాడినా అందులో ఒక మాట పక్కగా బాహుబలి సినిమా గురించి ఉంటుంది. అంతలా జనాల్లోకి వెళ్లిందీ సినిమా. అలాగే సినిమాలోని పాత్రలు కూడా జనాల్లో బాగా అలజడి సృష్టించాయి. ప్రధాన పాత్రలైన బాహుబలి.. భల్లాలదేవ..కట్టప్ప ఒకెత్తయితే.. శివగామి మరో ఎత్తు. బాహుబలిని చూసిన ప్రపంచ వీక్షకులకు చిరస్థాయిగా గుర్తుండిపోతుంది.
ఆ పాత్రను రమ్యకృష్ణ చేసిన తీరు అందరూ బాగుందనే ఎప్రీషియేట్ చేస్తున్నారులే. ఇప్పుడు సదరు పాత్రలో ఆమెను కాకుండా మరెవ్వరిని రాజమాతగా ఊహించుకోవడం కష్టం. అంతలా చెదరని ముద్ర వేసింది. కానీ ఇప్పుడు విషయం ఏమిటంటే ముందు ఈ పాత్ర కోసం ఎవర్ గ్రీన్ బ్యూటీ శ్రీదేవిని అనుకున్నాడు రాజమౌళి. శ్రీదేవి కాదనడంతో రమ్యకృష్ణను వరించింది ఈ సువర్ణ అవకాశం. అందుకే ఇప్పుడు ఎంత గొప్ప అవకాశం మిస్సయిందో శ్రీదేవి అంటూ బాలీవుడ్ మీడియా కూడా రచ్చ రచ్చ చేస్తోంది. ఇంతకీ శ్రీదేవి ఈ ఛాన్సును ఎందుకు మిస్ చేసుకున్నట్లు?
అసలు రమ్యకృష్ణ కు తన కెరీర్ లోనే గొప్ప సినిమాగా మిగిలిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే శ్రీదేవి రూపంలో ఈ అదృష్టం రమ్యకృష్ణను వరించిందనమాట. ఏదేమైనా కూడా నాకు ఇంత డబ్బులు కావాలి.. నా పాత్ర చుట్టూతానే కథలు తిరగాలి అనే ఆలోచనలు తగ్గించుకుని.. కాసినన్ని మంచి సినిమా అవకాశాలు వదులుకోకపోతే బెటర్ శ్రీదేవి. ఏమంటావ్ నానా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/