ఒక ప్రక్కన సినిమాలో సెక్సిణి శృతిహాసన్ ఉంది. ఇంకో ప్రక్కన ముద్దొచ్చేసే బుగ్గలతో హన్సిక సందడి చేస్తోంది. ఇంటెన్స్‌గా నటించే విలన్ సుదీప్ ఉన్నాడు. ఇంతమంది ఉన్నా కూడా హీరో విజయ్ తరువాత సీనియర్ హీరోయిన్ శ్రీదేవి గురించే అందరూ ఎందుకు మాట్లాడుకుంటున్నారబ్బా? అసలు ''పులి'' ట్రైలర్ రిలీజ్ అయినప్పటినుండి శ్రీదేవికే ఎక్కడ లేని కితాబులు వచ్చేస్తున్నాయి. ఎందుకిలా?
అబ్బే ఏం లేదంట.. నిజానికి శ్రీదేవి ఈ సినిమా ట్రైలర్ వస్తున్న వెంటనే తన సొంత పి.ఆర్. ఏజన్సీ ఒకరిని రంగంలోకి దింపింది. వారు వెంటనే మీడియా అంతా ఊదరగొట్టడం స్టార్ట్ చేశారు. శ్రీదేవి మేకప్‌లోని అద్భుతాల గురించి ఓరోజు, ఆవిడ డ్రస్సులు వేసుకున్న తీరు గురించి ఓరోజు, సెట్లో పోటీపడి నటించిన తీరు గురించి ఓరోజు.. ఇలా రోజుకోసారి రోజుకోరకంగా ప్రెస్ రిలీజ్లు ఇస్తూపోయారు. దానితో శ్రీదేవి గురించి బాలీవుడ్ మీడియా అంతా ఫోకస్ చేసేసింది. ఒక ప్రక్కన సౌత్‌లో శ్రీదేవి ముఖమేంటి అలా పాలిపోయిన ముసలమ్మలా ఉందని ఎద్దేవా చేస్తుంటే.. బాలీవుడ్ మీడియాలో మాత్రం రచ్చ రంబోలా అని న్యూస్ వచ్చేస్తోంది.
ఇక మనం శ్రీదేవిని పొగడకపోయినా.. బాలీవుడ్లో శ్రీదేవిని తెగ పొగిడేస్తుండటంతో.. ఈ సినిమా నిర్మాతలు కూడా శ్రీదేవి గొప్పతనం గురించి పేజీల పేజీల వ్యాసం రాసి మీడియాకు పంపేశారు. మొత్తానికి శ్రీదేవి సొంత టీమ్ ఎంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తోందో చూశారా...