శ్రీదేవి- బోనీకపూర్ జంట అన్యోన్యతపై ఎలాంటి సందేహాలు లేవు. కానీ ఒక విషయంలో మాత్రం బోనీకపూర్ వల్ల శ్రీదేవి ముప్పు తిప్పలు పడేవారట. ఆయన ఏదీ చెప్పింది వినేవారు కాదట. అతడి ఆ అలవాటు వల్ల శ్రీదేవి ఆరోగ్యం కూడా చెడిపోయింది. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. బోనీ గారాల పట్టీ జాన్వీకపూర్.
నాన్నగారికి ఉన్న ఆ అలవాటు మాన్పించేందుకు తన సోదరి ఖుషీతో కలిసి చాలా ప్రయత్నించానని కూడా జాన్వీ వెల్లడించింది. శ్రీదేవిని టెన్షన్ పెట్టి జాన్వీ-ఖుషీని కూడా ఇబ్బందులకు గురి చేసిన బోనీ పాపా ఆ అలవాటు ఏమిటి? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
నిజాకికి బోనీకి ఉన్న చెడు అలవాటు చైన్ స్మోకింగ్. డాడీ బోనీ కపూర్ స్మోకింగ్ మానేయడానికి తన తల్లి శ్రీదేవి ఆరోగ్యాన్ని ఎలా పణంగా పెట్టిందో జాన్వీ కపూర్ ఇటీవలే ఓపెన్ గా వెల్లడించింది. ఒకప్పుడు బోనీ సిగరెట్ వెంట సిగరెట్ తాగేవాడని.. అతడిని ఎవరూ ఆపలేరని జాన్వీ తెలిపింది. అందుకే బోనీ ఆ అలవాటు మానుకోవాలని శ్రీదేవి నాన్ వెజ్ తినడం మానేసింది.
తాజా ఇంటర్వ్యూలో ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగినట్లు జాన్వీ వెల్లడించింది. ఆ సమయంలో చెల్లెలు ఖుషీ - తల్లిదండ్రులతో కలిసి జాన్వీ తమ జుహు ఇంట్లో నివసించేవారు. అప్పట్లో బోనీ తీవ్రంగా ధూమపానానికి అలవాటు పడ్డాడు. ప్రతిరోజూ ఉదయం ఖుషీతో సిగరెట్ ప్యాకెట్లను నాశనం చేయడానికి కొత్త మార్గాలను కనుగొనేదానిని అని.. శ్రీ దేవి కూడా అతనితో పోరాడుతూనే ఉండేదని జాన్వీ నాటి ఆ రహస్యాన్ని వెల్లడించింది. ఈ సన్నివేశం నో ఎంట్రీ,.. వాంటెడ్ సమయంలో ఇంట్లో వార్ లా నడిచేదని కూడా జాన్వీ అంది.
అతడిని ఆపాలంటే శ్రీ దేవి శాఖాహారిగా మారాల్సి వచ్చింది. అతను ధూమపానం మానివేసే వరకు నాన్ వెజ్ తిననని తన తల్లి ఒప్పందం కుదుర్చుకుందని కానీ ఆమె బలహీనంగా ఉన్నందున వైద్యులు ఆమెకు సలహా ఇచ్చారని జాన్వి తెలిపారు. కానీ శ్రీదేవి మొండిగా ఉండేది. బోనీ ఆమెను వేడుకునేవాడు.
నాలుగు-ఐదు సంవత్సరాల తరువాత బోనీ అలవాటు మానుకున్నాడు. ఇప్పుడు ఇలా ఉన్నాడు. ``ఆమె నన్ను ఆపాలని కోరుకుంది. అప్పుడు నేను చేయలేకపోయాను. నేను ఇప్పటికి మానుకుంటున్నాను`` అని బోనీ అనడం విశేషం.
2018లో శ్రీదేవి మరణం యావత్ సినీ ప్రపంచానికి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. శ్రీదేవి దుబాయ్ లో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించినట్లు దుబాయ్ పోలీసులు రికార్డుల్లో రాసారు. బోనీ మేనల్లుడు మోహిత్ మార్వా వివాహ వేడుకకు హాజరయ్యేందుకు బోనీ.. తన చిన్న కూతురు ఖుషీతో కలిసి శ్రీదేవి అక్కడికి వెళ్లారు. కానీ తిరిగి రాని లోకాలకు అట్నుంచే పయనమవ్వడం అభిమాన లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. బాత్రూమ్ లో కాలు జారి పడిపోయిన శ్రీదేవి తలకు గాయమై మరణించిందనేది రిపోర్ట్. కానీ దీనిని ఎవరూ నమ్మలేదు. ఇప్పటికీ నమ్మరు! ఇది హత్య అని కూడా చాలా మంది అనుమానిస్తారు. కానీ దుబాయ్ పోలీసులు ప్రమాదవశాత్తూ జరిగిన మరణం అని డిక్లేర్ చేసారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... జాన్వీ కపూర్ త్వరలో సర్వైవల్ థ్రిల్లర్ మిలీలో కనిపించనుంది. ఇందులో సన్నీ కౌశల్ - మనోజ్ పహ్వాతో స్క్రీన్ స్పేస్ పంచుకుంది. అలాగ రాజ్‌కుమార్ రావుతో మిస్టర్ అండ్ మిసెస్ మహి ... వరుణ్ ధావన్ తో బావాల్ లో కూడా కనిపించనుంది. ఆమె చివరిగా గుడ్ లక్ జెర్రీలో కనిపించింది. జాన్వీ నటిగా పరిపక్వతతో అందరినీ ఆకట్టుకుంటోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.