ఇదే మా కథ’ లాంటి చిత్రాలను తెరకెక్కించాలంటే నిర్మాతలకు గట్స్ ఉండాలి - శ్రీకాంత్
సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్య హోప్‌లు కలిసి నటించిన చిత్రం ‘ఇదే మా కథ’. శ్రీమతి గుర్రప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద జీ మహేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు గురు పవన్ దర్శకుడు. ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు.
గురు వచ్చి ఓ సబ్జెక్ట్ చెప్పాడు. అది తన డ్రీమ్ అని చెప్పాడు. రియల్ ఇన్సిడెంట్‌లు కూడా ఉంటాయి. ఓ నలుగురు బైక్ ట్రావెల్లర్స్ కలవడం, వారి కష్టాలను ఒకరినొకరు ఎలా పంచుకున్నారు.. ఎలా పరిష్కరించుకున్నారు అనేదే కథ. ఇక్కడి నుంచి లడఖ్ వరకు బైక్ రైడింగ్ అని చెప్పడంతోనే షాక్ అయ్యాను. ఇది యూత్‌ను టచ్ చేసే కథ అని చాలా రోజుల తరువాత మళ్లీ వచ్చిందని ఓకే చెప్పాను. ఇందులో మహేంద్ర పాత్రలో కనిపించబోతోన్నాను. 24 ఏళ్ల క్రితం మిస్ అయిన అమ్మాయిని కలుసుకునేందుకు లఢఖ్ వెళ్తాడు. బైక్‌లోనే ఎందుకు వెళ్తాడు అనే దానికి కూడా ఓ కథ ఉంటుంది. భూమిక ఇందులో ఓ గృహిణిగా, ఇద్దరు పిల్లల తల్లిగా కనిపిస్తుంది. వాళ్ల నాన్న కలలను నిజం చేసేందుకు ఓ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి లడఖ్‌లో జరిగే ఈవెంట్‌లో పొందు పరిచేందుకు వస్తుంది. ప్రతీ యంగ్ స్టర్‌కి ఓ కల ఉంటుంది. కానీ తల్లిదండ్రులు మాత్రం అది వద్దు ఇది వద్దు అని అంటుంటారు. కానీ అవేం ఇష్టముండవు. బైక్ రేసింగ్‌లంటే ఇష్టపడే క్యారెక్టర్. ఇంకో క్యారెక్టర్ థాన్యా హోప్ అనే అమ్మాయి మాతో ఎలా కలిసి ఎందుకు కలిసింది అనేది కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.
కులు మనాలి నుంచి లడఖ్ వరకు బైక్ మీద షూటింగ్ చేశాం. అంతకు ముందు కొంత మేం చేశాం.. కొంత టీం మాత్రమే వెళ్లి షూటింగ్ చేసింది. యువతలో ఆలోచనలు రేకెత్తించేలా చిత్రం ఉంటుంది. కలను సాకారం చేసుకునేందుకు చాలా కష్టపడాలి. సంకల్పం లేకపోతే లక్ష్యాన్ని మనం చేరుకోలేమనే థీమ్‌తో నడుస్తుంది. అయితే షూటింగ్ చేసేటప్పుడు మాత్రం మేం ఎక్కువగా భద్రత గురించే ఆలోచించాం. నాకు, సుమంత్‌కు బైక్ రైడింగ్ వచ్చు. కానీ భూమిక, థాన్యా హోప్‌లను పెట్టుకుని చేయడం చాలా కష్టమయ్యింది. అందుకోసమే మేం రియల్ బైక్ రైడర్స్‌ను కూడా తీసుకున్నాం. వాళ్ల సూచనలతోనే ముందుకు వెళ్లాం. అలా ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాం. ఇలాంటి చిత్రాలను తెరకెక్కించాలంటే నిర్మాతలకు గట్స్ ఉండాలి. ఏదో పేరుకే బైక్ రైడింగ్ మీద సినిమా తీశామని కాదు. ఇంత మంది అక్కడికి తీసుకెళ్లడం మామూలు విషయం కాదు. డైరెక్టర్ ఏం అనుకున్నారో అది తెరకెక్కించేలా నిర్మాత సహకరించారు.
నాకు బైక్ రైడింగ్‌లంటే చాలా ఇష్టం. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బైక్ మీదే తిరిగేవాడిని. మద్రాస్ నుంచి హైద్రాబాద్‌కు కూడా బైక్ మీదే వచ్చేవాడిని. ఇక బాధ్యతలు పెరుగుతున్న సమయంలో భద్రత దృష్ట్యా బైక్‌లను పక్కన పెట్టేశాను. కానీ మళ్లీ ఇలా బైక్ రైడింగ్ చేయడం ఆనందంగా అనిపించింది. నా సీన్ లేకపోయినా కూడా బైక్ ఎక్కి తిరిగేవాడిని. చేతులు వదిలేసి మరీ నడిపేవాడిని. అలా రోడ్డు మీద డిఫరెంట్ లొకేషన్స్‌ను చూసుకుంటూ వెళ్లడం ఎంతో ఆనందంగా అనిపించింది.
మామూలుగా బైకర్స్ అంతా కూడా ఢిల్లీలో కలుస్తుంటారు. అక్కడి నుంచి ట్రూప్‌గా వెళ్తారు. ఆ జర్నీని వాళ్లు ఎంజాయ్ చేస్తుంటారు. ఈ గ్రూపుల్లో కలిసిన వాళ్లంతా కూడా జీవితాంతం ఫ్రెండ్స్ అవుతుంటారు. వారి జీవిత కష్టాలను కూడా ఇందులో చూపించాం.
కులుమనాలి చేసిన షూటింగ్ చాలా కష్టంగా అనిపించింది. చలిలో అంత దూరం బైక్ నడపడం, హెల్మెట్స్ పెట్టుకోవాలి.. మొహాలు కూడా కనపడాలి.. అలాంటి ప్లేస్‌లో షూట్ చేయడం చాలా కష్టం. రేసర్స్ సాయంతో అలా 15 కిలో మీటర్ల దూరం వెళ్లి షూటింగ్ చేసేశాం.
నలుగురు క్యారెక్టర్స్ చుట్టూ తిరిగే కథ ఇది. గురుకు ఉన్న ప్యాషన్, డ్రీమ్ ఇది. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదలవుతోంది. నేను చూశాను. మాకు సంతృప్తిగా అనిపించింది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఇలా అన్నీ కూడా బాగున్నాయి. దర్శకుడు కొత్తవాడు. ఆయనకు కొన్ని భావాలున్నాయి. అన్ని రకాల ఎమోషన్స్ ఉండేలా చూసుకున్నాడు. పృథ్వీ క్యారెక్టర్‌తో కామెడీని కూడా జోడించాడు.
జీవితం అంటే ఏంటి? మనం కన్న కలలను సాకారం చేసుకునేందుకు, అనుకున్న లక్ష్యాలను ఎలా చేరుకోవాలి? వాటి కోసం ఎంతలా కష్టపడాలి అనేది ఈ చిత్రంలోని సందేశం.
మేం ఇద్దరం ఇంత వరకు కలిసి పని చేయలేదు. భూమిక గారు ఎంతో చక్కగా నటించారు. ఎప్పుడూ చీరలో కనిపించే భూమిక ఇలా రైడర్ లుక్కులో కనిపించడం కొత్తగా ఉంటుంది. అసలు ఈ పాత్ర చేస్తారా? లేదా? అని అందరం అనుకున్నాం. కానీ ఆమె కథ విన్న వెంటనే ఓకే చెప్పేశారు. ఫ్లాష్ బ్యాక్‌లో నాకు ఓ జంట ఉంటుంది. ఆమెను కలిసేందుకే అక్కడికి వెళ్తాను. ఆమె బైకును చూసే నన్ను ఇష్టపడుతుంటుంది. నన్ను గుర్తు పట్టకపోయినా ఆ బైకును అయినా కూడా గుర్తుపడుతుందని వెళ్తాడు.
రోషన్‌ను ఇప్పుడే దింపే ఆలోచన లేదు. ఇంకో ఏడాది ఆగుదామని అనుకున్నాం. లాస్ ఏంజిల్స్‌లో నటనలో శిక్షణ తీసుకున్నాడు. ఆ తరువాత సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 సినిమాకు ప్రభుదేవా దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడు. ఎక్స్‌పీరియన్స్ కోసం అవన్నీ చేశాడు. నేను కేవలం సాయం మాత్రమే చేశాను.
ఓ సారి రాఘవేంద్ర రావు గారు ఫోన్ చేసి రోషన్ గురించి అడిగారు. ఇంకా చిన్నపిల్లవాడే కదా? అని అన్నారు. అది పదేళ్ల క్రితమండి.. ఇప్పుడు కాదు అని అన్నాను. ఓసారి నా దగ్గరికి తీసుకురావా? అని అడిగారు. అలా మేం ఇద్దరం వెళ్లాం. పెళ్లి సందడి ఫ్లేవర్‌తో అదే టైటిల్ పెట్టి సినిమా తీసేందుకు స్క్రిప్ట్ వరకు కూడా రెడీ అయింది. రోషన్ కోసం అనే కాదు కానీ కథను రెడీ చేసుకున్నారు. కానీ మధ్యలో ఎవరో చెప్పినట్టున్నారు. శ్రీకాంత్ కొడుకు అయితే బాగుంటుందని అన్నట్టున్నారు. అలా రోషన్‌ను చూసి.. కరెక్ట్‌గా సరిపోయాడు.. ఈ ఏజ్ ఉండాలనే అనుకున్నాని అని రాఘవేంద్రరావు గారు అన్నారు. అలా సినిమా ఆఫర్ వచ్చింది.
రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా ఎంతో మంది హీరోలు లాంచ్ అయ్యారు. ఆ అవకాశం రావడం రోషన్ అదృష్టం. ఆయన ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. అలాంటి వారి దర్శకత్వంలో రోషన్ చేయడం ఆనందంగా ఉంది.
పోలికలు అయితే అందరూ పెడతారు. అది తెలిసిన విషయమే. ఎవరు బాగా చేశారు? ఎవరు బాగున్నారు? అని తేడాలు చూస్తారు. కానీ నాకంటే రోషన్ బాగుంటాడు. అది అందరికీ తెలిసిన విషయమే. మనం కష్టపడితేనే గుర్తింపు వస్తుంది. మొదటి సినిమానే కదా? నేను ఎక్కువగా గర్వంగా చెప్పుకోకూడదు. పొగడకూడదు.
ఇప్పుడు వస్తున్న జానర్లకంటే కొత్తగా ఉంటుంది. పెళ్లిలో ఉండే గోల, ఆ సందడి, కామెడీ, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఇలా అన్నీ బాగుంటాయి. మహిళా ప్రేక్షకులందరూ కూడా వచ్చి చూసే చిత్రమవుతుంది. ఎఫ్ 2 సినిమా ఎంత ఫ్రెష్‌లా అనిపించిందో.. పెళ్లి సందD కూడా అంతే ఫ్రెష్‌గా ఉంటుంది. సాంగ్స్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్స్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఇందులో బాస్కెట్ బాల్ ప్లేయర్‌గా రోషన్ కనిపించబోతోన్నారు.
అక్టోబర్ 2న మా సినిమా విడుదల కాబోతోంది. నిర్మాతలు చాలా కష్టపడ్డారు. గురుకు ఇది చాలెజింగ్ మూవీ. డిఫరెంట్ మూవీ ఇది. ఈ చిత్రం హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.
అఖండ సినిమాలో కొత్తగా కనిపిస్తాను. ఫ్రెష్‌గా కనిపిస్తాను. దాని కోసం ముంబై నుంచి డిజైనర్లను తీసుకొచ్చారు. రగ్డ్ గెటప్‌లో ఉంటాను. మహిళా ప్రేక్షకులు మళ్లీ నన్ను తిడతారేమో అని అనుకునేవాడిని. బయటకు మాత్రం చూపించడం లేదు. ఎప్పుడైనా లుక్ రివీల్ చేస్తారా? లేదా నేరుగా సినిమాలోనే చూపిస్తారా? అన్నది తెలియదు.
శ్రీరామరాజ్యం సినిమాలో లక్ష్మణుడిగా బాలకృష్ణ పక్కన చేశాను. మళ్లి ఇంత క్రూరమైన పాత్రలో కనిపిస్తే బాగుంటుందా? అని అన్నాను. ఇలాంటి పాత్రలే చేయాలి. దీని తరువాత చాలా క్యారెక్టర్స్ వస్తాయి. కానీ ఏది పడితే అది చేయకు అని బాలకృష్ణ సలహా ఇచ్చారు. అది మన మంచికే. బాలకృష్ణ గారు కథలు వింటే అందరికీ సజెస్ట్ చేస్తుంటారు.
సాయి ధరమ్ తేజ్ చాలా మంచివాడు. మేమంతా కలిసి క్రికెట్ ఆడేవాళ్లం. బైక్ ప్రమాదాలు అనేవి సాధారణంగా జరుగుతుంటాయి. సాయి ధరమ్ తేజ్ క్షేమంగా ఉన్నారు. ఈ రోజు కూడా మాట్లాడాను. ఇంకా త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఆయన చిత్రం రిపబ్లిక్ పెద్ద హిట్ కావాలి. మంచి బూస్టప్ ఇవ్వాలి.