ఫీల్ గుడ్ ఫామిలీ ఎంటర్ టైనర్స్ ని మనసుకు హత్తుకునేలా తీస్తాడని పేరున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు బ్రహ్మోత్సవం తాలూకు నీలి నీడలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దాని దెబ్బకు హీరో మహేష్ మళ్ళి అదే బ్యానర్ లో సినిమా చేయడానికి ఆసక్తి చూపలేనంత దారుణంగా ఫలితం రావడంతో శ్రీకాంత్ కొంతకాలం ఎక్కడ కనిపించకుండా కొత్త సినిమా స్క్రిప్ట్ కోసం తన స్వస్థలానికి వెళ్ళిపోయాడు. ఇన్నాళ్లకు బయటికి వచ్చి తనకు అవకాశం ఇస్తామన్న నిర్మాతల చుట్టూ తిరుగుతున్నాడు. శ్రీకాంత్ అడ్డాలతో సినిమాలు చేసేందుకు రెండు సంస్థలు గతంలో ఆసక్తి చూపాయి. అందులో ఒకటి గీతా ఆర్ట్స్ కాగా రెండోది దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. అల్లు అరవింద్ శిరీష్ కోసం శ్రీకాంత్ అడ్డాలకు అడ్వాన్స్ ఇచ్చాడని కానీ ఇప్పుడు ఆ ఇద్దరూ ఏమంత ఆసక్తి చూపకపోవడం వల్ల ముందు తీసుకెళ్లే ఆలోచన చేయనట్టుగా కనిపిస్తోంది. ఆ మధ్య శిరీష్ స్వయంగా శ్రీకాంత్ తో సినిమా చేసే ప్లాన్ ఏదీ లేనట్టు కుండబద్దలు కొట్టడంతో ఇప్పట్లో అది ఉండటం అనుమానమే.
మరో వైపు దిల్ రాజు తో కొత్త బంగారు లోకం-సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల మరోసారి ఆయన మీదే ఆశలు పెట్టుకున్నాడు. కానీ దిల్ రాజు ఇంకా స్పందించడం లేదని తెలిసింది. కాకపోతే ఆలస్యంగా అయినా తనకు నచ్చే కథ చెబితే దిల్ రాజు సినిమా తీసే తీరతారు. కానీ మెప్పించడమే కష్టం. దానికే శ్రీకాంత్ అడ్డాలకు టైం పడుతోందట. నిర్మాతలు ఎవరో ఒకరు ఓకే చెప్పినా హీరోని సెట్ చేసుకోవడం అనే కొత్త ఛాలెంజ్ కూడా శ్రీకాంత్ అడ్డాల ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయినా ఒక డిజాస్టర్ వచ్చినంత మాత్రాన దర్శకుడి కెరీర్ అయిపోతుంది అని చెప్పడానికి లేదు. 2001లో గుణశేఖర్ మృగరాజు అనే సూపర్ మెగా ప్లాప్ ఇచ్చాక రెండేళ్ల గ్యాప్ లో ఒక్కడుతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అంత పర్ఫెక్ట్ బౌన్స్ బ్యాక్ ని ఎవరూ ఊహించలేదు కూడా. పరిశ్రమలో ఇలాంటి అద్భుతాలకు కొదవే లేదు. శ్రీకాంత్ అడ్డాల కూడా అదే నమ్మకంతో ఉన్నాడు. మరి అరవింద్ దిల్ రాజు ల మధ్య మొదటి అవకాశం ఎవరు ఇస్తారా అనేదే ప్రస్తుతానికి సస్పెన్స్.