పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు స్టార్ట్ చేయడం ప్రారంభించినప్పటి నుండి ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి మొదలయింది. మొన్నటివరకు సైలెంట్ గా ఉన్నటువంటి మేకర్స్ అందరూ ఇప్పుడు కథలు - స్క్రిప్టులు రాసే పనిలో పడ్డారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. అదే సినిమాతో రీఎంట్రీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎంట్రీ మూవీనే అదిరిపోయే సరికి ఇప్పుడు తదుపరి సినిమాలపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు తదుపరి సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు.
అయితే వకీల్ సాబ్ మూవీతో పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు.. ఇటు ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా భారీ లాభాలను ఖాతాలో వేసుకున్నారు. అలాగే టాలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా తదుపరి సినిమాలు లైనప్ చేస్తున్నాడు. ఆల్రెడీ దిల్ రాజు ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలకు సైతం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే రాంచరణ్ - శంకర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ అందుకోనున్నాడు. అయితే వకీల్ సాబ్ హిట్ తర్వాత దిల్ రాజు పవన్ తో మరో సినిమా చేసెందుకు సిద్ధంగా ఉన్నట్లు.. ఓ స్టోరీ కూడా రెడీ అవుతోందని ఆ మధ్యలో తెలిపాడు.
ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ స్టోరీ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. నిజానికి ఇదివరకు వకీల్ సాబ్ కాంబినేషన్ రిపీట్ చేయాలనీ అనుకున్నాడు. కానీ డైరెక్టర్ వేణుశ్రీరామ్ వేరే స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉండటంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ స్టోరీ బాధ్యతలు వేరే దర్శకుడికి అప్పగించే ఆలోచనలో ఉన్నాడట. అయితే ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో అసురన్ రీమేక్ నారప్ప తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ఆ సినిమా ఆల్రెడీ అదిరిపోయే స్టిల్స్ - గ్లింప్స్ రిలీజ్ అయ్యాయి. ఆ సినిమా విషయంలో దిల్ రాజు డైరెక్టర్ పనితనం చూసి పవన్ కళ్యాణ్ స్టోరీ బాధ్యతలు శ్రీకాంత్ కు అందించే ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల చేతిలో నారప్పతో పాటు కర్ణన్ రీమేక్ కూడా లైన్ లోకి రానుందట. మరి ఆ సినిమా కన్ఫర్మ్ కాకపోతే పవన్ స్టోరీ ఛాన్స్ శ్రీకాంత్ కు దక్కే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏం జరగనుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.