శ్రీ‌‌కాంత్ వార‌సుడు దూసుకొస్తున్నాడు!

Update: 2018-10-27 14:30 GMT
శ‌తాధిక చిత్రాల హీరో శ్రీ‌కాంత్ న‌ట‌వార‌సుడు రోష‌న్  ప్ర‌స్తుతం ఏం చేస్తున్నాడు?  టాలీవుడ్ హ్యాండ్స‌మ్ హీరోగా అత‌డికి గొప్ప గుర్తింపు ద‌క్కింది. న‌టించిన తొలి చిత్రంతోనే ఫ‌ర్వాలేద‌న్న టాక్ వినిపించింది. ప‌రిశ్ర‌మ‌కు మ‌రో ప్రామిస్సింగ్ స్టార్ ప‌రిచ‌య‌మ‌య్యాడ‌న్న మెప్పు ద‌క్కింది. కానీ మొద‌టి సినిమా `నిర్మ‌లా కాన్వెంట్` క‌థ విష‌యంలో - మేకింగ్ ప‌ర‌మైన వైఫ‌ల్యాల‌తో ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. వాస్త‌వానికి ఆ సినిమాతో రోష‌న్‌ ని లాంచ్ చేయాల‌ని శ్రీ‌కాంత్ అనుకోలేదు. అది అనుకోకుండా కుదిరిన ప్రాజెక్ట్ అని అప్ప‌ట్లోనే చెప్పారు. అయితే కింగ్ నాగార్జున అంత పెద్ద స్టార్ కం నిర్మాత త‌న మిత్రుడు శ్రీ‌కాంత్ కొడుకుని ఎట్టిప‌రిస్థితిలో ఈ క‌థ‌తోనే లాంచ్ చేయాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌డంతో అప్ప‌టికి త‌ప్ప‌లేదు. అలా రోష‌న్ న‌టించిన మొద‌టి చిత్రం `నిర్మ‌లా కాన్వెంట్` రిలీజైంది. కానీ అది బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యం సాధించ‌లేదు. నాగార్జున ఈ చిత్రంలో గెస్ట్ రోల్ పోషించినా సినిమాని మాత్రం ఆదుకోలేక‌పోయారు.

అనంత‌ర ప‌రిణామం తెలిసిందే. ప్ర‌స్తుతం రోష‌న్ న‌ట‌శిక్ష‌ణ పూర్తి చేసుకుని మ‌రోసారి బ‌రిలో దిగేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్ప‌టికే యాక్టింగ్ తో పాటుగా - డ్యాన్సులు - ఫైట్స్‌ లో పూర్తి స్థాయి ట్రైనింగ్ తీసుకున్నాడ‌ట‌. ఆహార్యం విష‌యంలో స్పెష‌లిస్టుల వ‌ద్ద ప్ర‌త్యేకించి త‌ర్ఫీదు పొందాడ‌ని తెలుస్తోంది. రోష‌న్ ప్ర‌స్తుతానికి అన్నిర‌కాలా తిరిగి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రిప‌రేష‌న్‌ లో ఉన్నాడు.

ఇదే సంగ‌తిని నేడు `ఆప‌రేష‌న్ 2019` సినిమా రిలీజ్ ప్ర‌మోష‌న్స్‌ లో శ్రీ‌కాంత్ వెల్ల‌డించారు. మీ అబ్బాయిని తిరిగి ఎప్పుడు తీసుకొస్తున్నారు? అన్న ప్ర‌శ్న‌కు శ్రీ‌కాంత్ మాట్లాడుతూ -``మా వాడిని తిరిగి తీసుకొస్తున్నా. అన్నిర‌కాలా న‌ట‌శిక్ష‌ణ తీసుకుని ప్రిపేర్డ్‌ గానే ఉన్నాడు. 2019లో లాంచ్ అయ్యే అవ‌కాశం ఉంది. మంచి క‌థ‌ - ద‌ర్శ‌కుడు కుదిరితే ఇక లాంచ్ చేయ‌డం ఖాయ‌మైన‌ట్టే`` అని తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కూ ద‌ర్శ‌కుడెవ‌రు? అన్న‌ది మాత్రం నిర్ణ‌యించ‌లేద‌ని వెల్ల‌డించారు.
Tags:    

Similar News