టాలీవుడ్‌లో శతాధిక చిత్రాల హీరోగా శ్రీకాంత్‌ని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అతడికి ఏపీ, తెలంగాణ అనే తేడా లేకుండా అన్నిచోట్లా వీరాభిమానులున్నారు. అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. ప్రతియేటా శ్రీకాంత్ ఫోటోలతో క్యాలెండర్ వేసి మరీ నైజాం ఫ్యాన్స్ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. అయితే అంతటి హీరో ఇటీవలి కాలంలో కాస్త క్రైసిస్‌ని ఎదుర్కొన్నాడు.
శాటిలైట్ వ్యాపారం దారుణం అవ్వడం వల్ల కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం. అయితే శ్రీకాంత్ ఒకప్పుడు పీక్స్‌లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో, ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. ఆ మాట తీరులో మార్పేమీ లేదు. ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఇంకోలా మాట్లాడే స్వభావం అతడికి లేదనడానికి నిన్నటి రోజున తానాలో అతడు మాట్లాడిన తీరు చెబుతుంది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు, అసలు కెరీర్ ప్రారంభించనప్పుడు అతడు మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. అదే అతడిని అంత పెద్ద స్టార్‌ని చేసింది. కెరీర్‌లో ఏ స్టేజీకి ఎదిగేసినా చిరుకి తమ్ముడిలానే పేరు తెచ్చుకున్నాడు. మాట జవదాటనివాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రామభక్తుడు ఆంజనేయుడిలా చిరునామస్మరణం చేశాడు. ఇప్పుడు చిరుతనయుడు చరణ్‌ని అంతే అభిమానిస్తాడు అతడు.
నిన్నటిరోజున తానా వేడుకల్లో 'నన్నింకా అభిమానులు గుర్తు పెట్టుకున్నారంటే చరణ్ 'గోవిందుడు..'లో నటించడం వల్లే'నని వినమ్రంగా చెప్పాడు. బోల్డ్ ఎటెంప్ట్ అయినా మెగా ఫ్యామిలీపై అతడి అభిమానం బైటికొచ్చిందిలా. శ్రీకాంత్ నటించిన నాటు కోడి, వీడికి దూకుడెక్కువ, జల్సారాయుడు, మొండోడు, ఢీ అంటే ఢీ చిత్రాలు రిలీజ్‌లకు రావాల్సి ఉంది.