పాత్రకు తగ్గట్టు మారిపోవడంలో శ్రీకాంత్ తనకు తానే సాటి. విలన్ నుంచి హీరో దాకా అన్ని రకాల పాత్రలు చేసేశాడు. ఒక పక్క హీరోగా రాణిస్తూనే... మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేసేస్తున్నాడు. ఇప్పుడు అతని మొదటి హారర్ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన రాజకీయలాపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.
పవన్ కళ్యాణ్ కు శ్రీకాంత్ మంచి స్నేహమే ఉంది. పవన్ జనసేన పార్టీ స్థాపించి... రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులు పోటీలో నిల్చుంటారని కూడా ప్రకటించాడు. ఆ పోటీలో జనసేన నాయకులతో పాటూ, కొందరు సినిమా వాళ్లు కూడా ఉండే అవకాశం ఉందని ఎవరికైనా అర్థమైపోతుంది. ఎందుకంటే పవన్ కు సినిమా వాళ్లలో ఎంతో మంది మంచి స్నేహితులున్నారు. వారిలో శ్రీకాంత్ కూడా ఒకడు. కాబట్టి ఆయన కూడా జనసేనలో చేరుతాడేమోనన్న అనుమానాలు రాక మానవు. ఆ అనుమానం మీడియాకు వచ్చిందంటే... అడగకుండా ఎందుకు ఊరుకుంటుంది?
శ్రీకాంత్ నటించిన హారర్ మూవీ రారా. ఆ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా విలేకరులతో మాట్లాడాడు శ్రీకాంత్. ఈ సందర్భంగా ఒక విలేకరి... మీరు జనసేనలో చేరుతారా? వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని ప్రశ్నించాడు. దానికి శ్రీకాంత్ తనకు జనసేనే కాదని... ఏ రాజకీయ పార్టీలో కూడా చేరే ఉద్దేశం లేదని చెప్పాడు. రాజకీయాల్లో తన కెరీర్ ను వెతుక్కునే ప్రయత్నం చేయనని తెగేసి చెప్పాడు. పార్టీలో చేరకపోయినా... జనసేన తరఫున కనీసం ప్రచారం చేస్తాడో చేయడో శ్రీకాంత్... అని చెవులు కొరుక్కుంటున్నారు సినీ జనాలు.