శతాధిక చిత్రాల హీరోగా శ్రీకాంత్ అందరికీ సుపరిచితం. అందరితో కలిసిపోతూ.. వివాదాలకు దూరంగా ఉండే హీరోగానూ శ్రీకాంత్ కి మంచి పేరుంది. ప్రస్తుతం శ్రీకాంత్ కెరీర్ నెమ్మదించిన సంగతి తెలిసిందే. ఇక అతడి ఫ్యామిలీ నుంచి నటవారసుల్ని రంగంలోకి దించేశారప్పుడే.
అతడి కొడుకు రోషన్ (16) ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వం వహించిన 'రుద్రమదేవి 3డి'లో చిన్నప్పటి రానా (చాళుక్య వీరభద్రుడు) పాత్రలో నటించాడు. తనయురాలు మేధ (11) .. చిన్నప్పటి రుద్రమదేవి (అనుష్క) పాత్రలో కనిపిస్తుంది. సెప్టెంబర్ 4 రిలీజ్ తేదీ ప్రకటించారు కాబట్టి శ్రీకాంత్ నటవారసుల్ని తెరపై చూసుకోవడానికి ఇంకెంతో సమయం లేదు.
రోషన్ ని హీరోగా తెరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం అతడు స్టడీస్ చేస్తున్నాడు. పెద్ద చదువులు పూర్తి చేశాకే రోషన్ హీరో అయితే బావుంటుందని శ్రీకాంత్ అండ్ ఊహ భావిస్తున్నారు. అంటే కొంత సమయం పడుతుంది కానీ రోషన్ హీరో గా ఆరంగేట్రం చేయడం అనేది ఖరారైనట్టే. రోషన్ కి కూడా చిన్నప్పట్నుంచి సినిమాలు, క్రికెట్ అంటే ఇష్టం. నటనకు తొలి ప్రాధాన్య ఇస్తున్నాడని చెబుతున్నారు.
బెల్లంకొండ శ్రీను, అఖిల్, ఆకాశ్ పూరి ఇలా హీరోలంతా లైన్ లోకొచ్చారు. ఆ కోవలోనే శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా హీరోగా లక్ చెక్ చేసుకోవడానికి రాబోతున్నాడు. ఇది వారసుల టైమ్.. మరి!