ఫేట్ ఎలా డిసైడైతే జీవితం అలా దిశ మార్చుకుంటుంది. ఇది ప్రతి ఒక్కిరికి అనుభవ పాఠమే. ఛార్మింగ్ హీరో శ్రీకాంత్ విలన్ అవ్వాలని సినిమాల్లోకి వచ్చాడు. కానీ అతడిని పరిశ్రమ హీరోని చేసింది. కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాల్లో నెగిటివ్ రోల్స్ పోషించినా పూర్తి స్థాయి విలన్ గా మాత్రం కనిపించలేదు. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటించిన `యుద్ధం శరణం గచ్ఛామీ`లో విలన్ గా నటించినా ఆ సినిమా పరాజయం పాలవ్వడంతో శ్రీకాంత్ రోల్ పెద్దగా రీచ్ కాలేదు. అడపాదడపా నెగిటివ్ రోల్స్ పోషించాడు గానీ.. విలన్ గా సెటిల్ కాలేదు. దీంతో కొన్ని దశాబ్ధాల పాటు శ్రీకాంత్ డ్రీమ్ మాత్రం పుల్ ఫిల్ కాలేదనే చెప్పాలి. నేడు శతాధిక చిత్రాల హీరోగా రికార్డులకెక్కిన శ్రీకాంత్ కి నెరవేరని డ్రీమ్ ఇది అని చెప్పాలి.
తాజాగా శ్రీకాంత్ డ్రీమ్ నెరవేరబోతోందని తెలుస్తోంది. బోయపాటి రూపంలో జాక్ పాట్ తగిలిందట. నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి తెరకెక్కిస్తున్న సినిమాలో విలన్ గా నటించే అవకాశం శ్రీకాంత్ ని వెతుక్కుంటూ వచ్చిందట. ఇప్పటికే బాలయ్య కు జోడీగా ఇద్దరు భామాల్ని ఎంపిక చేసారు. ఇక ముఖ్య విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ని రంగంలోకి దింపుతున్నారు. మున్నాభాయ్ తో పాటుగా మరో విలన్ గా శ్రీకాంత్ ని తీసుకుంటున్నట్లు సమాచారం. అదే నిజమైతే ఛార్మింగ్ స్టార్ కల నెరవేరినట్లే.
విలన్ పాత్రకు బోయపాటి ఇచ్చే ప్రాధాన్యత ఎలాంటిదో తెలిసిందే. హీరోలకు ధీటుగా విలన్లను తీర్చిదిద్దుతాడు. సీన్ లో ఫైటర్ల క్యారెక్టర్లు సైతం అంతే బలంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ కి సదవకాశమేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. లెజెండ్ చిత్రంతో జగపతి బాబులో విలనిజాన్ని బయటకు తీసింది బోయపాటి శ్రీకాంత్ కి అంతే మంచి అవకాశం ఇస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. జగ్గుభాయ్ పాత్ర తర్వాత జగపతి కెరీర్ పూర్తిగా టర్న్ తీసుకుంది. ప్రస్తుతం శ్రీకాంత్ కు హీరోగా అవకాశాలు లేని నేపథ్యంలో విలన్ గా గనుక క్లిక్కయితే మరో కొత్త దారి దొరికినట్టే. ప్రస్తుతం దర్శకులంతా విలన్ పాత్రలంటే బాలీవుడ్ నటులపైనే ఆధారపడాల్సి వస్తోంది. టాలీవుడ్ లో ప్రతిభ దాగి ఉన్నా మన దర్శకులు ఇటు చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. లోకల్ ట్యాలెంటు వైపు చూస్తూ బోయపాటి మంచి ప్రయత్నమే చేస్తున్నారని భావించవచ్చు.