మహేష్ బాబు బాక్సాఫీస్ స్టామినా ఏంటో ‘శ్రీమంతుడు’తో మరోసారి రుజువైంది. రెండు పెద్ద ఫ్లాపుల తర్వాత మహేష్ చేసిన ఈ సినిమా నాన్-బాహుబలి రికార్డులన్నింటినీ తుడిచి పెట్టేసింది. ఇప్పటికే రూ.95 కోట్ల షేర్ సాధించిన ‘శ్రీమంతుడు’ ఫుల్ రన్ లో వంద కోట్ల మార్కు దిశగా సాగుతోంది. కలెక్షన్ ల లెక్కల్లో మాత్రమే కాకుండా... ఆడియో పరంగానూ సంచలనం రేపింది ‘శ్రీమంతుడు’ సినిమా. యూట్యూబ్ లో ‘శ్రీమంతుడు’ జ్యూక్ బాక్స్ ద్వారా ఏకంగా 40 లక్షల మంది ఈ పాటల్ని వినడం విశేషం. నిన్ననే ‘శ్రీమంతుడు’ జ్యూక్ బాక్స్ 4 మిలియన్ వ్యూస్ క్లబ్ లో అడుగుపెట్టింది. ఇప్పటిదాకా ఏ తెలుగు సినిమాకూ ఇలాంటి గౌరవం దక్కలేదు. ఈ క్రెడిట్ అంతా దేవిశ్రీ కే దక్కుతుంది.
ఒకప్పుడైతే ఓ ఆడియో ఎంత పెద్ద హిట్టనేది క్యాసెట్ లు, సీడీల అమ్మకం ద్వారా లెక్కగట్టే వాళ్లు. కానీ ఇంటర్నెట్ లో ఫ్రీగా పాటలు దొరికేస్తుండటంతో ఇప్పుడు సీడీలు కొనే నాథులే ఉండట్లేదు. దీంతో శ్రోతలకు నచ్చిన మార్గంలోనే వారికి ఆడియో అందించి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు నిర్మాతలు. నేరుగా యూట్యూబ్ లో జ్యూక్ బాక్స్ ద్వారా పాటలు వినే సౌకర్యం కల్పిస్తున్నారు. డౌన్ లోడ్ చేసుకునే ఓపిక, సౌకర్యం లేని వాళ్లంతా ఎంచక్కా యూట్యూబ్ ద్వారా పాటలు వింటున్నారు. ఇది ఇద్దరికి ఉభయతారకమైన సౌలభ్యం. యూట్యూబ్ లో వ్యూస్ ప్రకారం ఆదాయం ఉంటుంది. 40 లక్షల హిట్స్ వచ్చాయంటే ఆదాయం కూడా భారీ గానే ఉంటుంది. ఒక్కో వ్యూ కి కనీసం రూపాయి అనుకున్నా.. రూ.40 లక్షలు నిర్మాత ఖాతాలో పడ్డట్లే. మొత్తానికి ‘శ్రీమంతుడు’ సినిమానే కాదు.. ఆడియో కూడా పెద్ద సంచలనమే అయింది.