విడుదలైన తొలిరోజు తొలి ఆట నుండీ యునానిమస్ పాజిటీవ్ టాక్ తో విజయపధంలో మహేష్ 'శ్రీమంతుడు' దూసుకుపోతున్నాడు. రెండు ఫ్లాపులతో పెరిగిపోయిన అభిమానుల నిరీక్షణకు ఎట్టకేలకు ముగింపు పలికాడు మన సూపర్ స్టార్. కొరటాల శివ పక్కా క్లాస్ కధకు పకడ్బందీ మాస్ కధనాన్ని జోడించి అటు కలెక్షన్ ల విజయాన్ని, అభిమానుల ప్రేమను సొంతంచేసుకున్నాడు.
మొదట్నుంచి ప్రీ క్లైమాక్స్ వరకూ మహేష్ పాత్ర చిత్రీకరణ, సన్నివేశాలలో ఇంటెన్సిటీ, మాటలలో పదును క్రమం తప్పకుండా తెరకెక్కించిన శివపై ప్రశంసలతో పాటూ క్లైమాక్స్ ని సరిగ్గా హ్యాండిల్ చెయ్యలేదనే విమర్శలు కూడా అదే రేంజ్ లో వినిపిస్తున్నాయి.
అద్భుతమైన నటనతో ప్రీ క్లైమాక్స్ లో మహేష్ బాబు ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించాక ఒకేసారి మూడ్ మొత్తం మార్చేసి వెంటనే ఫైట్ సీన్ పెట్టేయడం, అప్పటివరకూ అత్యంత క్లాస్ గా సాగిన సినిమాటోగ్రఫీ క్వాలిటీ తగ్గిపోవడం, చేసిన గ్రాఫిక్స్ మరీ నాసిరకంగా మారడంతో సినిమా పూర్తయ్యాక ఏదో చిన్న అసంతృప్తి ప్రేక్షకుడికి కలగడం సహజం. మరి కొరటాల ఈ ఫీడ్ బ్యాక్ ని విన్నాడో లేదో...