ఒకప్పుడు తెలుగు సినిమా పొరుగు రాష్ట్రాల్లో కూడా విడుదలవడమే గొప్ప అనుకునేవాళ్లు. ఇప్పుడు దేశ విదేశాల్లో భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఒక్క అమెరికాలోనే 150 స్క్రీన్స్ లో సినిమా రిలీజవుతోందంటే మామూలు విషయం కాదు. ఒకటి రెండు దేశాల్లో కాదు.. ఇప్పుడు దాదాపు పాతిక దేశాల్లో తెలుగు సినిమా విడుదలవుతుండటం విశేషం. ఏ పెద్ద సినిమా వచ్చినా ఏదో ఒక కొత్త దేశానికి తెలుగు సినిమా విస్తరిస్తోంది. మొన్న బాహబలి వచ్చినపుడు కొన్ని కొత్త దేశాలు యాడ్ అయ్యాయి. ఐతే ఇప్పటిదాకా ఏ తెలుగు సినిమా అడుగుపెట్టని ఖండంలో ‘శ్రీమంతుడు’ విడుదల కాబోతోంది.
లాటిన్ అమెరికా (దక్షిణ అమెరికా)లో తొలిసారి విడుదలవతున్న తెలుగు సినిమాగా ‘శ్రీమంతుడు’ రికార్డు సృష్టించనుంది. శ్రీమంతుడు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో అర్జెంటీనా, చిలీ దేశాల్లోని తెలుగువారు థియేటర్లో సినిమా చూసిన అనుభూతి పొందాలని కోరుకుంటున్నారు. వాళ్ల డిమాండ్ మేరకు ఇండియన్ ఫిలిమ్స్ కొలాబరేషన్స్ సంస్థ ‘శ్రీమంతుడు’ ప్రత్యేక ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తోంది. రాబోయే శుక్రవారం షోలు వేస్తున్నారు. సోషల్ మీడియాలో షోల గురించి ప్రచారం చేస్తున్నారు. ఐతే మిగతా దేశాల్లో మాదిరి రెగ్యులర్ షోలు వేయకుండా మన దగ్గర బెనిఫిట్ షోల తరహాలో ఎప్పటికప్పుడు టికెట్లు అమ్మి షోలు వేయాలని ప్లాన్ చేస్తున్నారు. టికెట్ల ధరలు కొంచెం ఎక్కువే ఉన్నాయి. మొత్తానికి ఓవర్సీస్ మార్కెట్లో మహేష్ కున్న సత్తా ఏంటో ‘శ్రీమంతుడు’ రుజువు చేస్తోంది.