ఔనా.. మహేష్ రెండు ఫ్లాపులిచ్చాడా?

Update: 2015-07-31 09:58 GMT
1 నేనొక్కడినే పెద్ద ఫ్లాప్ అనుకుంటే.. ఆ తర్వాత వచ్చిన మహేష్ సినిమా ‘ఆగడు’ డిజాస్టర్ అనిపించుకుంది. 1 అయినా మంచి సినిమా అని పేరు తెచ్చుకుంది కానీ.. ఆగడు మాత్రం చాలా చెడ్డ సినిమాగా గుర్తింపు సంపాదించింది. మహేష్ లాంటి కాన్ఫిడెంట్ మ్యాన్ కూడా రెండు నెలలు బయటికి రాలేనంతగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. తర్వాత కోలుకుని చాలా కసిగా ‘శ్రీమంతుడు’ చేశాడు. ఐతే శ్రీమంతుడు సినిమా విషయంలో ప్రస్తుతం టాలీవుడ్లో నెలకొన్న సందడి, హైప్ చూస్తుంటే ఈ సినిమా హీరో రెండు పెద్ద ఫ్లాపులు ఇచ్చాడంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఆ రెండు ఫ్లాపులు మహేష్ ఇమేజ్ ను ఏమాత్రం డ్యామేజ్ చేయలేదని.. ‘శ్రీమంతుడు’కు జరిగిన బిజినెస్, శాటిలైట్ రైట్స్ అమ్మకం.. మారు అమ్మకాలు చాటి చెబుతున్నాయి.

1 లాంటి ఫ్లాప్ తర్వాత కూడా ‘ఆగడు’ సినిమాకు మహేష్ కెరీర్లో నే అత్యధిక బిజినెస్ జరిగింది. దాదాపు 60 కోట్ల వరకు బిజినెస్ చేశారు. ఐతే శ్రీమంతుడు ‘ఆగడు’ రికార్డు దాటేసి ఇంకొన్ని కోట్లు ఎక్కువే బిజినెస్ చేసింది. ఐతే బయ్యర్లు మామూలుగానే రికార్డు రేట్లు పెట్టి కొంటే.. మారు బేరాల్లో వారికింకా లాభాలు వస్తుండటం విశేషం. సీడెడ్ ఏరియాకే తీసుకుంటే ఏడున్నర కోట్లు పెట్టి ఓ వ్యక్తి రైట్స్ తీసుకున్నాడు. అతను జిల్లాల వారీగా మారు బేరాలకు అమ్ముకుంటే కోటిన్నర మిగిలిందని చెబుతున్నారు. మిగతా ఏరియాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే శ్రీమంతుడు బిజినెస్ రూ.70 కోట్లు దాటినట్లే అనుకోవాలి. ఇక శ్రీమంతుడు శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు ఛానెల్ రూ.17 కోట్లు పెట్టి కొన్నట్లు సమాచారం. అదే నిజమైతే బాహుబలితో సమానంగా ప్రైస్ తెచ్చుకున్నట్లే. ఈ లెక్కలన్నీ చూస్తుంటే మహేష్ రెండు పెద్ద ఫ్లాపులిచ్చాడంటే నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.
Tags:    

Similar News