నవంబర్ నెల టాలీవుడ్ కి కాసింత డల్లుగా నడుస్తోందన్న మాట వాస్తవమే. ఈ వారం చైతు మూవీ సాహసం శ్వాసగా సాగిపో రిలీజ్ కానుండడంతో.. కౌంటర్లు కళకళలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత కూడా వరుసగా సినిమాలున్నాయి. వీటిలో అల్లరి నరేష్ మూవీ "ఇంట్లో దెయ్యం.. నాకేం భయం".. శ్రీనివాస రెడ్డి నటిస్తున్న "జయమ్ము నిశ్చయమ్మురా".. సప్తగిరి యాక్ట్ చేసిన "సప్తగిరి ఎక్స్ ప్రెస్"లు ఆసక్తి కలిగిస్తున్నాయి.
వీటిలో జయమ్ము నిశ్చయమ్మురా.. సప్తగిరి ఎక్స్ ప్రెస్ లు ఒకే రోజున విడుదల కానున్నాయి. ఓ వారం గ్యాప్ లో రావాలి కానీ.. ఇప్పుడు ఒకే డేట్ కి సెట్ అయ్యాయి. ఇద్దరూ కమెడియన్ నుంచి హీరోగా అప్ గ్రేడ్ అయేందుకు ట్రై చేస్తున్న వారే కావడం ఇక్కడ ఆసక్తి కలిగించే విషయం. శ్రీనివాస రెడ్డి మూవీకి ముందే నుంచే బజ్ ఉండడం పాజిటివ్ అంశమైతే.. సప్తగిరి సినిమా ఆడియోకి పవన్ కళ్యాణ్ రావడంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది.
మరి ఈ ఇద్దరిలో ఎవరి మూవీ ఎంత ఫేర్ చేస్తుందనే విషయం ఆసక్తికరం. రెండూ చిన్న సినిమాలే కాబట్టి.. కంటెంట్ బాగుంటే.. ఒకే రోజు వచ్చేసినా సేఫ్ జోన్ లోకి వచ్చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ రీసెంట్ గా ఆలీ చేసిన కామెంట్స్ ఓసారి పరిశీలిస్తే.. మరి ఇద్దరు కమెడియన్స్ హీరోలుగా మారడం బాగానే ఉంది కానీ.. మరి హీరోగానే కెరీర్ కంటిన్యూ చేస్తామంటారా.. లేక కమెడియన్ వేషాలు వేసుకుంటూ అడపాదడపా మెరిపిస్తారా అనేదే ఆసక్తి కలిగించే విషయం. శ్రీనివాసరెడ్డి వరకూ రెండు పడవలనూ నడిపించేయడం గీతాంజలి నుంచి చూస్తూనే ఉన్నాం. ఇది కూడా హిట్ అయ్యాక.. మరి శ్రీనివాస రెడ్డి ఏం చేస్తాడో.. హిట్ సాధించేశాక.. సునీల్ లాగా నేను కూడా హీరోనే అని అంటారో చూడాలి. "
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/