ఇటీవలి కాలంలో హిట్లు లేని దర్శకులు - సినిమా ఛాన్సులు పోగొట్టుకుంటున్నవాళ్లు తమ నామధేయాల్లో లోపాల్ని సవరించుకునే పనిలో పడ్డారు. అప్పట్లో కొందరు తారలు ఏకంగా పేర్లు మార్చేసుకుంటే, మరికొందరు తమ పేర్లను న్యూమరాలజీ ప్రకారం స్పెల్లింగుల్ని సరి చేసుకున్నారు. పలికేప్పుడు ఒకలా, రాసేప్పుడు ఇంకోలా మారిపోతున్నాయి ఈ పేర్లు. ఇటీవలో ఓంకార్ తన పేరులో `హెచ్`ని రెండో అక్షరంగా ఉపయోగించాడు. 'ఓహెచ్ ఎం కెఎ ఆర్' .. అని ఆరు అక్షరాలు కనిపించాయి అతడి పేరులో. ఆ ఒక్క హెచ్ ని అదనంగా తగిలించడంతో 'రాజుగారి గది' లాంటి హిట్టొచ్చిందని నమ్ముతున్నాడు ఓంకార్. గతంలో తమన్నా కూడా ఇలాగే చేసింది.
అతడి బాటలోనే ఇప్పుడు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి కూడా పేరులో అక్షరాన్ని సవరించాడు. శ్రీనివాస్ రెడ్డి పేరులో చివరి అక్షరం `ఇ` వచ్చేలా సరిచేసుకున్నాడు. ఇదంతా న్యూమరాలజిస్టులు చెప్పిన ప్రకారమే చేశాడు. మరి మామ మంచు- అల్లుడు కంచు` ఫలితం.. ఈ పేరు మార్పిడి కరెక్టేనా? కాదా? అన్నది డిసైడ్ చేస్తుందన్నమాట! ఒకవేళ శ్రీనివాస్ రెడ్డికి హిట్టొస్తే మరికొంత మంది ఈ పద్ధతిలోనే వెళ్లే ఛాన్సుంది. అసలింతకీ పేరులో చివరన `ఇ` చే రింది కాబట్టి అతడిని శ్రీనివాస్ రెడ్డే అని పిలవాలా?