రెడ్డి గారూ.. ఏం పిసుకుతారులే సార్‌!!

Update: 2016-06-05 06:55 GMT
''ఈ మధ్య కాలంలో కొన్ని వెబ్ సైట్లలో వస్తున్న ఆర్టికల్స్ చూస్తుంటే దారుణంగా ఉన్నాయి. వాళ్ళందరూ బాగా స్ర్టెస్ లో ఉన్నట్లున్నారు. ఒక బాల్ కొనుక్కోండి. హ్యాపీగా పిసుక్కుంటే స్ర్టెస్ తగ్గుతుంది'' అంటూ కామెంట్లు చేశాడు కమెడియన్‌ శ్రీనివాస్ రెడ్డి. నిజానికి ఈ కామెంట్లన్నీ కాస్త ఎక్సట్రానే.. కాకపోతే ఆయనకు సినిమాల్లో సైడ్‌ నుంచొని అలాంటి ఎక్సట్రా డైలాగులు వేసీవేసీ ఇలాంటి మాటలు అలవాటు అయిపోయాయ్‌ అనేది ఈ కామెంట్లు విన్నోళ్ళ కామెంట్‌.

నిజానికి అ..ఆ సినిమాను ఒక స్థాయికి తీసుకెళ్ళిన ఘనత అంతా వెబ్‌ మీడియాదే. ఎందుకంటే సినిమా రిలీజైన రెండు గంటలకే తామ పాజిటివ్‌ రివ్యూలు.. నటీనటుల పెర్ఫామెన్స్ గురించి వారు రాసిన పొగడ్తలు.. అలాగే సినిమాలోకి సోల్‌ పాయింట్‌ పై వారి శాటిసఫ్యాక్షన్‌.. ఇవన్నీ సినిమాకు బాగా ప్లస్‌ అయ్యాయ్‌. ఇకపోతే కొంత క్రిటిసిజం అనేది తప్పనసరి. ఆ మాత్రం చెప్పేవారు లేకపోతే త్రివిక్రమ్ కు కూడా తదుపరి ఏం తీయాలో తెలియదు. ఇవన్నీ సినిమాకు మాంచి ప్లస్సవుతున్న వేళ.. సినిమాలో తన రోల్‌ బాగా చిన్నది.. పైగా అస్సలు ఏమాత్రం ఉపయోగపడేది కాకపోవడంతో.. ఆ స్ర్టెస్ బాల్‌ ఏదో తన పిసుక్కోకుండా రెడ్డి గారు మీడియాను పిసుక్కోమనడం ఎందుకో మరి?

పోనివ్‌ మనోడి కామెంట్లు త్రివిక్రమ్ కథ దొబ్బేశాడని అందరూ ఏకేశారు అందుకేనా? స్వయంగా ఆయనే యద్దనపూడి గారికి థ్యాంక్స్ కార్డు వేశాను కాని టెక్నికల్‌ గా మిస్సయ్యింది అంటూ ఓ డిజిటల్‌ కవరింగ్‌ చేశారుగా.. ఆ బాల్‌ ఏదో ఆయనకే కొనిపెట్టు మిష్టర్‌ రెడ్డి!!
Tags:    

Similar News