త్రివిక్రమ్ తో చేసిన అఆ తర్వాత లై షాక్ ఇచ్చినా త్వరగానే కోలుకున్న నితిన్ తన కొత్త సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. చల్ మోహనరంగా షూటింగ్ చివరి దశలో ఉండగా ఇప్పటికే వదిలిన రెండు తమన్ ట్యూన్స్ ఆడియో మార్కెట్ లో హల్చల్ చేస్తున్నాయి. పవన్-త్రివిక్రమ్ జంట నిర్మాణంలో రూపొందుతున్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఇది విడుదల కాకుండానే మరో సినిమా కూడా లైన్ లో పెట్టేసాడు నితిన్. అదే శ్రీనివాస కళ్యాణం. దిల్ రాజు నిర్మాణంలో శతమానం భవతికి నేషనల్ అవార్డు వచ్చేలా చేసిన దర్శకుడు వేగ్నేశ సతీష్ తో నితిన్ ఇది చేయబోతున్నాడు. షూటింగ్ స్టార్ట్ అవుతున్న సందర్భంగా దీని మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ విడుదల చేసింది దిల్ రాజు యూనిట్.
హడావిడి లేకుండా పెళ్లి పీటల మీద నితిన్, హీరొయిన్ రాశి ఖాన్న పెళ్లి చేసుకుని చక్కగా దిగిన స్టిల్స్ తో రూపొంది చాలా హోమ్లీగా అనిపిస్తూ మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వస్తోంది అనే హామీ ఇచ్చేలా ఉంది. తొలిప్రేమ ఎఫెక్ట్ కాబోలు రాశి ఖన్నాకు మంచి రోల్స్ దక్కుతున్నాయి. ఇన్నాళ్ళు గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితమైన రాశి తొలిప్రేమ నుంచి తీసుకున్న కొత్త టర్న్ ఈ అవకాశాన్ని తెచ్చినట్టు కనిపిస్తోంది. ఫీల్ గుడ్ మ్యూజిక్ తో ఉన్న ఈ మూవీలో మరో హీరొయిన్ గా ఎక్కడికి పోతావు చిన్నవాడ ఫేం నందిత శ్వేత నటిస్తోంది. ఎమోషనల్ ఫ్యామిలీ స్టొరీ గా దీన్ని తీర్చిదిద్దుతున్నట్టు టాక్.
ఇదే టైటిల్ తో సుమారు ముప్పై ఏళ్ళ క్రితం వెంకటేష్ - భానుప్రియ - గౌతమి లీడ్ రోల్స్ లో సినిమా వచ్చింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీ అప్పట్లో మంచి హిట్ గా నిలిచింది.క్లీన్ మూవీస్ కి ప్రాధాన్యత ఇచ్చే దిల్ రాజు ప్రొడక్షన్ గురించి చెప్పేదేముంది.ఆరు నెలల లోపే షూటింగ్ పూర్తి చేసి దీపావళికి విడుదల చేసే ప్లాన్ లో ఉంది యూనిట్.
Full View